Big Stories

Rahul Gandhi : రాహుల్ గాంధీ మ్యాచ్ ఫిక్సింగ్ కామెంట్స్.. ఈసీకి బీజేపీ ఫిర్యాదు..

Rahul Gandhi
Rahul Gandhi
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది.
ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలు తాము సార్వత్రిక ఎన్నికల్లో 400 ఎంపీ సీట్లు సాధిస్తామని పదేపదే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కాషాయ నేతలపై రాహుల్ గాంధీ సంచలన విమర్శలు చేశారు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరగకుండా బీజేపీ 400 ఎంపీ స్థానాలు గెలవడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.
రాహుల్ గాంధీని ఫిర్యాదులతో ఇబ్బంది పెట్టాలని చూసే బీజేపీకి తాజా వ్యాఖ్యలు సాకుగా దొరికాయి. రాహుల్ కామెంట్స్ కు కాషాయ నేతలు కొత్త అర్థాలు వెతికారు. కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి నేతృత్వంలోని బీజేపీ బృందం ఈసీకి ఫిర్యాదు చేసింది.
ఎన్నికల సంఘంలో కేంద్రం తన వాళ్లను పెట్టిందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారని హర్దీప్ సింగ్ పురి అన్నారు. ఈవీఎంల పనితీరుపై సందేహాలు లేవనెత్తారని.. సార్వత్రిక ఎన్నికల తర్వాత రాజ్యాంగాన్ని మార్చేస్తామని ఆరోపించారని తెలిపారు. ఈ వ్యాఖ్యలపైనే  ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు.

ఢిల్లీ రామ్ లీలా మైదానంలో నిర్వహించిన ఇండియా బ్లాక్ లోక్ తంత్ర బచావో ర్యాలీలో రాహుల్ గాంధీ బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతున్న విషయాన్ని ప్రస్తావించారు. అంపైర్లపై ఒత్తిడి తెచ్చి.. ప్లేయర్లను కొనేసి, కెప్టెన్స్ ను బెదిరించి మ్యాచ్ ల్లో విజయం సాధించవచ్చు. ఇలా చేస్తే మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు.

త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు అంపైర్లను ప్రధాని మోదీ ఎంపిక చేశారని రాహుల్ గాంధీ విమర్శించారు. ఎన్నికలకు ముందే ప్రతిపక్ష నేతలను అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు.  మ్యాచ్‌ ఫిక్సింగ్‌, ఈవీఎంలు, సోషల్‌ మీడియా, మీడియాపై ఒత్తిడి లేకుండా బీజేపీ 180 కంటే ఎక్కువ స్థానాలు గెలవడం సాధ్యంకాదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపైనే బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News