BigTV English

VK Naresh: ఏపీ ఎలక్షన్స్.. రక్తపాతం తప్పదు.. నరేష్ సంచలన వ్యాఖ్యలు

VK Naresh: ఏపీ ఎలక్షన్స్.. రక్తపాతం తప్పదు.. నరేష్ సంచలన వ్యాఖ్యలు


VK Naresh: సీనియర్ నటుడు నరేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. కోట్ల ఆస్తి ఉన్నా కూడా ఆత్మ సంతృప్తి కోసం సినిమాలు చేస్తూ వస్తున్నాడు. నటనలో ఆయనను కొట్టేవారు లేరు అంటే అతిశయోక్తి కాదు. కామెడీ, విలన్, ఎమోషనల్.. ఏదైనా సరే నరేష్ కు కొట్టిన పిండి. ఇక వ్యక్తిగతంగా ఆయన ఎన్నో వివాదాలను ఎదుర్కున్నాడు. ముఖ్యంగా మూడో భార్య రమ్య రఘుపతి.. అతడి జీవితాన్ని నడిరోడ్డుపై లాగింది. మీడియా ముందు అతడి నిజ స్వరూపం బయటపెట్టింది. నరేష్ స్త్రీ లోలుడు అని, తనను టార్చర్ పెట్టాడని చెప్పుకొచ్చింది.

ఇక నరేష్ సైతం రమ్యపై ఎన్నో ఆరోపణలు చేశాడు. ఆ తరువాత నటి పవిత్ర లోకేష్ తో అతడి రిలేషన్ ఏ రేంజ్ లో సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ జంట కలిసే ఉంటున్నారు.ఇక ఇవన్నీ పక్కన పెడితే.. నరేష్ రాజకీయాల్లో యమా యాక్టివ్ గా ఉంటాడు. తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. తాజాగా నరేష్ ఏపీ ఎన్నికలపై ఒక సంచలన ట్వీట్ వేశాడు.


ప్రస్తుతం ఏపీలో ఎలక్షన్స్ హీట్ ఏ రేంజ్ లో ఉందో అందరికి తెల్సిందే. రాజకీయ నాయకులు పోటాపోటీగా ప్రచారాలు సాగిస్తున్నారు. మాటల తూటాలు పేలుస్తున్నారు. ఈ నేపధ్యలోనే నరేష్ ట్వీట్ ఎన్నో అనుమానాలకు దారితీస్తుంది. ” ఏపీలో అధికార మార్పిడి జరిగేముందు పెద్ద రక్తపాతం జరగనుందని నేను నమ్ముతున్నాను” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. దీంతో నెటిజన్స్ ఆ పెద్ద రక్తపాతం ఏంటి.. ? ఏ పార్టీలో జరుగుతుంది.. ? ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరుగుతుందా.. ? అని కామెంట్స్ పెడుతున్నారు. మరి నరేష్ చెప్పింది నిజమవుతుందో లేదో చూడాలంటే ఎలక్షన్స్ అయ్యేవరకు ఆగాల్సిందే.

Related News

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big TV Kissik Talks: తిండి లేకుండా బస్టాండ్ లో పడుకున్నాం – జబర్దస్త్ సౌమ్య రావు

Big Stories

×