E-Paper
Advertisement

Janhvi Kapoor Ram Charan: రామ్ చరణ్‌తో జాన్వీ కపూర్ రొమాన్స్.. కన్ఫామ్ చేసిన బోణీ కపూర్!

Janhvi Kapoor Ram Charan: రామ్ చరణ్‌తో జాన్వీ కపూర్ రొమాన్స్.. కన్ఫామ్ చేసిన బోణీ కపూర్!
Advertisement

Janhvi Kapoor with Ram Charan in RC16: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. మాస్ డైరెక్టర్ శంకర్ ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. గత రెండేళ్ల క్రితం పట్టాలెక్కిన ఈ మూవీ షూటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది.

ఇందులో రామ్ చరణ్ రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నట్లు టాక్. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఈ మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా పూర్తయిన తర్వాత రామ్ చరణ్ ‘ఉప్పెన’ ఫేం బుచ్చిబాబు దర్శకత్వంలో నటించబోతున్నాడు.

Advertisement

ఇప్పటికే వీరి కాంబో ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయినట్లు తెలుస్తోంది. మార్చిలో ఈ మూవీని ప్రారంభించి.. ఏప్రిల్ నుంచి కంటిన్యూగా షూటింగ్ చేస్తారని సమాచారం. ప్రస్తుతం ఈ మూవీ ‘ఆర్‌సి 16’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందబోతుంది.

ఈ సినిమాకి గానూ ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే ఆయన మ్యూజిక్ సిట్టింగ్ స్టార్ట్ చేసేశాడని .. రెండు పాటలకు కూడా అవి సెట్ అయినట్లు సమాచారం వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరిని సెలెక్ట్ చేయబోతున్నారు అనే ఉత్కంఠ మెగా అభిమానుల్లో ఎప్పటి నుంచో ఉంది. ఇప్పటికే ఈ మూవీలో హీరోయిన్‌కు సంబంధించి వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి.

Advertisement

READ MORE: రామ్ చరణ్‌ జోడీగా జాన్వీ.. జాన్వీ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

తాజాగా ఈ మూవీలో హీరోయిన్‌గా బాలీవుడ్ భామ ఎంపిక అయింది. అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ను ఈ మూవీలో హీరోయిన్‌గా మేకర్స్ సెలెక్ట్ చేశారు. ఈ విషయాన్ని జాన్వీ తండ్రి, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు.

త్వరలో తన కుమార్తె జాన్వీ కపూర్ .. రామ్ చరణ్‌తో సినిమా చేయబోతుందని ఆయన చెప్పారు. దీంతో ఆమె వద్దు బాబోయ్ అంటూ కొందరంటుంటే.. మరికొందరేమో రామ్ చరణ్, జాన్వీ జోడీ బాగుంటుందని చర్చించుకుంటున్నారు.

Read More: రామ్ చరణ్‌‌తో చిందులేయనున్న ఎన్టీఆర్ భామ..? సౌత్ సినిమాలతో బిజీ అయిన జాన్వీ కపూర్

కాగా జాన్వీ కపూర్ ప్రస్తుతం తెలుగు ‘దేవర’ మూవీ చేస్తోంది. ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇప్పుడు రామ్ చరణ్‌తో తెలుగులో రెండో సినిమా చేయబోతుంది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×