BigTV English

Delhi Farmers Protest Update: రైతులతో ముగిసిన చర్చలు.. కనీస మద్దతు ధరపై కీలక ప్రతిపాదన

Delhi Farmers Protest Update: రైతులతో ముగిసిన చర్చలు.. కనీస మద్దతు ధరపై కీలక ప్రతిపాదన
Union ministers and Farmer Leaders Meeting

Union ministers and Farmer Leaders Meeting: తమ డిమాండ్ల సాధనకై రైతులు.. ఢిల్లీ చలో పేరిట చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. రైతు సంఘాలతో కేంద్రం జరిపిన చర్చలు మూడుసార్లు విఫలమవ్వగా.. నాలుగో దఫా చర్చలో కేంద్రం రైతుసంఘాలకు కొన్ని ప్రతిపాదనలు పెట్టింది. ఆదివారం రాత్రి 8.15 గంటలకు ప్రారంభమైన ఈ భేటీ.. సోమవారం తెల్లవారుజామున 1 గంట వరకూ కొనసాగింది. ప్రభుత్వం తరపున వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా, వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్, హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రైతు నేతలతో చర్చలు జరిపారు. సమావేశం అనంతరం.. మంత్రి పీయూష్ గోయెల్ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.


రైతు సంఘాలతో రైతుల డిమాండ్లపై చర్చించామని, రైతులతో ఒప్పందం చేసుకున్న అనంతరం ఐదేళ్లపాటు పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను ప్రభుత్వ ఏజెన్సీలు కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తాయని తమ బృందం రైతు సంఘాలకు ప్రతిపాదించినట్లు తెలిపారు. ముఖ్యంగా కందులు, మినుములు, మైసూర్ పప్పు, మొక్కజొన్న పండించే సాగుదారులతో ఎన్సీసీఎఫ్, ఎన్ఏఎఫ్ఈడీ వంటి సహకార సంఘాలు ఒప్పందాలు చేసుకుంటాయని, కొనుగోలు చేసేటపుడు వాటి పరిమాణంపై ఎలాంటి పరిమితి ఉండదని పేర్కొన్నారు. అందుకోసం ప్రత్యేకంగా ఒక పోర్టల్ ను కూడా ప్రారంభిస్తామని మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు.

రైతు సంఘాలకు తాము చేసిన ప్రతిపాదనలతో పంజాబ్ లో రైతుల వ్యవసాయానికి రక్షణ ఉంటుందన్నారు. అలాగే భూగర్భజలాలు మెరుగయ్యి.. సాగుభూములు నిస్సారంగా మారకుండా ఉంటాయన్నారు.


Read More: లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కు ఊరట.. ఆప్ నేతల్లో గుబులు అదే..

మరోవైపు ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై రైతు నేత శర్వాన్ సింగ్ పంథేర్ స్పందించారు. ప్రభుత్వ ప్రతిపాదనల గురించి సోమ, మంగళవారాల్లో తాము తమ సంఘాలతో చర్చించి, నిపుణుల అభిప్రాయాలు కూడా తీసుకుని ఒక నిర్ణయానికి వస్తామని వివరించారు. అయితే రైతు రుణమాఫీ వంటి డిమాండ్లు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయని, దానిపై రెండ్రోజుల్లో స్పష్టత వస్తుందని తెలిపారు. ప్రస్తుతానికి ఢిల్లీ చలో కార్యక్రమానికి తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చినట్లు తెలిపారు. తమ డిమాండ్లన్నింటికీ పరిష్కారం రాని నేపథ్యంలో ఫిబ్రవరి 21 నుంచి తిరిగి నిరసనలు, ఆందోళనలు ప్రారంభిస్తామన్నారు.

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×