Brahma Anandam Teaser: హాస్య బ్రహ్మా బ్రహ్మానందం.. ఈ పేరు వినగానే ముఖం మీద చిరునవ్వు అలవోకగా వచ్చేస్తుంది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. ఆయన తప్ప ఇంకెవరు కనిపించరు. మీమ్ గాడ్ గా బ్రహ్మీ ఈతరం జనరేషన్ కు తెలుసు. ఆయన చేయని పాత్ర లేదు. ఎలాంటి క్యారెక్టర్ లో అయినా నవ్వించడం ఆయనకే చెల్లుతుంది. నవ్వించేవాడు ఏం ఏడిపిస్తాడులే అని అనుకోవడం పొరపాటు. తన నటనతో బ్రహ్మీ ప్రేక్షకులను ఏడిపించిన రోజులు కూడా ఉన్నాయి.
ఎన్నో వందల సినిమాలు చేసి ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్ర వేసిన ఆయన.. తన కొడుకు గౌతమ్ ను హీరోగా నిలబెట్టలేకపోయారు. పల్లకిలో పెళ్లి కూతురు అనే సినిమాలో గౌతమ్ తెలుగుతెరకు పరిచయమయ్యాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఆ తరువాత అడపాదడపా గౌతమ్ సినిమాలు చేస్తూ వచ్చినా .. అవి అసలు ఎవరికి గుర్తు కూడా లేవు. అయినా గౌతమ్ ప్రయత్నాలు ఆపలేదు. ఇక ఈసారి కొడుకును నిలబెట్టడానికి బ్రహ్మీనే రంగంలోకి దిగాడు.
విజయ్ సేతుపతి కెరీర్‌లో బెస్ట్ సినిమాలు.. మూవీ లవర్స్ అస్సలు మిస్ అవ్వొద్దు.!
గౌతమ్, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం బ్రహ్మ ఆనందం. RVS నిఖిల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో బ్రహ్మీ- గౌతమ్ తండ్రీ కొడుకులుగా కాకుండా తాతా మనవళ్లుగా నటించారు. “నమస్కారం.. నా పేరు బ్రహ్మానందం” అంటూ గౌతమ్ తన గురించి తాను చెప్పుకుంటున్న డైలాగ్ తో టీజర్ మొదలయ్యింది.
తాను మంచివాడని, అందరికీ హెల్ప్ చేయడం తన వీక్ నెస్ అని చెప్పుకొచ్చాడు. ఇక ఇంకోపక్క వెన్నెల కిషోర్.. గౌతమ్ నిజ స్వరూపాన్ని చెప్తూ తిడుతూ కనిపించాడు. ఇక అంత మంచివాడు అయిన గౌతమ్ లైఫ్ లోకి ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య విలన్స్ వలన కాదు.. బ్రహ్మీ వలన అని గౌతమ్ చెప్పుకొచ్చాడు. ఇక బ్రహ్మీ ఎంటర్ అవ్వడంతోనే పంచ్ లు పడుతూ వచ్చాయి. అసలు బ్రహ్మీ ఎవరు అనేది గౌతమ్ చివర్లో క్లారిటీ ఇచ్చాడు. ఆయన మా తాత అని చెప్పి హాగ్ చేసుకున్నాడు.
అసలు తాత వలన మనవడు ఎదుర్కున్న సమస్యలు ఏంటి.. ? ఎందుకు తాత మనవడిని ఇబ్బంది పెడుతున్నాడు.. అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. టీజర్ మొత్తం నవ్వులతో నింపేశారు. బ్రహ్మీ లుక్ అదిరిపోయింది. ఇకపోతే ఈ సినిమా ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14 న రిలీజ్ కు రెడీ అవుతుంది. మరి ఈ సినిమాతో ఈ తండ్రీకొడుకులు ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.