BigTV English

Saif Ali Khan: సైఫ్ సామ్రాజ్యం ఇదే.. రాజ కుటుంబం నుంచి నటుడిగా?

Saif Ali Khan: సైఫ్ సామ్రాజ్యం ఇదే.. రాజ కుటుంబం నుంచి నటుడిగా?

Saif Ali Khan:సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan).. బాలీవుడ్ నటుడిగా పేరు దక్కించుకున్న ఈయన బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే మాత్రం నిజంగా నోరెళ్ళబెట్టాల్సిందే. రాజుల కుటుంబం నుంచి వచ్చారన్న విషయం దాదాపు చాలామందికి తెలియదనే చెప్పాలి. ముఖ్యంగా తన నటనతో సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న ఈయన, ఈమధ్య కాలంలో టాలీవుడ్ లో కూడా నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు కూడా మరింత చేరువయ్యారు. ఒకవైపు సినిమాలు చేస్తూ.. మరొకవైపు పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సైఫ్ అలీ ఖాన్ పై ఈరోజు గుర్తు తెలియని దుండగుడు ఒకరు కత్తితో దాడి చేసిన వైనం, అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మొత్తం ఆరు పోట్లు శరీరంలో పొడవగా.. అందులో రెండు లోతైన కత్తిపోట్లు తగిలాయని వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని బాంద్రాలో ఉన్న తన నివాసంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక ప్రస్తుతం లీలావతి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సైఫ్ అలీ ఖాన్ కు సర్జరీ పూర్తి చేశారు.


రాజుల కుటుంబం నుంచి వచ్చిన సైఫ్ అలీఖాన్..

ఈ క్రమంలోనే సైఫ్ అలీ ఖాన్ బ్యాక్ గ్రౌండ్ గురించి పలు వార్తలు వైరల్ గా మారుతున్నాయి. హైప్రొఫైల్ నేపథ్యం ఉన్న ఈయన గురుగ్రామ్ లో పేరు ఉన్న సంస్థానానికి వారసుడు కూడా. ఈయన ఆస్తి విలువ సుమారుగా రూ.1200 కోట్ల పై మాటే. సుమారుగా ఒక్కో సినిమాకు రూ.15 కోట్ల వరకు పారితోషకం తీసుకునే ఈయన.. ఒక్కో వాణిజ్య ప్రకటనకు రూ.5కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ముఖ్యంగా సైఫ్ అలీ ఖాన్ పలు ప్రాంతాలలో భవనాలు నిర్మించారని, వాటి ద్వారానే అద్దెల రూపంలో ఆదాయం బాగా లభిస్తోందని సమాచారం. ఇకపోతే సైఫ్ సంపన్న వారసత్వానికి పటౌడీ ప్యాలెస్ గా పేరు ఉన్న గురుగ్రామ్ లోని ఇబ్రహీం కోఠీ గుర్తుగా నిలుస్తోంది. దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో తన తాత నవాబ్ ఇఫ్తికార్ అలీ ఖాన్ తన భార్య బేగం ఆఫ్ భోపాల్ కి బహుమతిగా ఈ ఇంటిని నిర్మించి ఇచ్చారు. ఇందులో ఏడు పడక గదులు ఉన్నాయి. దీని విలువ సుమారుగా రూ.800 కోట్ల పైమాటే అని సమాచారం.


విలాసవంతమైన భవనాలు ఈయన సొంతం..

ఇక సైఫ్ అలీ ఖాన్ తండ్రి టీమిండియా మాజీ ఆటగాడు దివంగత మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ. ఈయన తల్లి సినీ నటి షర్మిలా ఠాగోర్. సైఫ్ అలీ ఖాన్ భార్య కరీనా కపూర్ కూడా ప్రముఖ నటి అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈమె కూడా కొన్ని సినిమాలలో నటించి భారీ పాపులారిటీ అందుకుంది. సైఫ్ అలీ ఖాన్ తన భార్య కరీనాకపూర్ తో కలిసి ముంబైలోని సద్గురు శరన్ లో ఉన్న విలాసవంతమైన ఇంట్లో నివసిస్తున్నారు. అంతకుముందు బాంద్రాలోని ఫార్చ్యూన్ హైట్స్లో కొన్నాళ్లు నివాసం ఉన్నారు ఈ జంట. దీని విలువ రూ.55 కోట్లు. అలాగే స్విట్జర్ల్యాండ్ లోని గస్టాడ్ ప్రాంతంలో రూ.33 కోట్ల విలువైన ఇంటిని కొనుగోలు చేశారు.

సైఫ్ అలీఖాన్ కార్ కలెక్షన్..

ఇక సైఫ్ అలీ ఖాన్ వద్ద ఉండే కారు కలెక్షన్స్ విషయానికి వస్తే.. బెంజ్ ఎస్ క్లాస్ కు చెందిన ఎస్ 350D, ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110, ఆడి Q7, జీప్ రాంగ్లర్ వంటి కార్లు కూడా ఉన్నాయి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×