Ktr And Raja Singh Tweets : మాజీ మంత్రి కేటీఆర్, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మధ్య ఎప్పటికప్పుడు ట్విట్టర్ వేదికగా మాటల యుద్దం జరుగుతున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పలుమార్లు ట్వీట్లతో సవాళ్లు విసురుకున్న వీరిద్దరూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కాస్త కూల్ అయిపోయారు. అయితే ఇప్పుడు మళ్లీ కేటీఆర్ పై వ్యంగ్యంగా ట్వీట్ చేశారు రాజాసింగ్. కేటీఆర్ జైలుకు వెళ్లటం ఖాయమని.. కావల్సిన లిస్ట్ ముందే రెడీ చేసుకోమని హెచ్చరించారు.
మాజీ మంత్రి కేటీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. నాపై తప్పుడు కేసులు పెట్టి BRS అన్యాయంగా అరెస్ట్ చేయించింది. ఇప్పుడు కేటీఆర్ కూడా జైలుకు వెళ్తున్నాడు అంటూ తెలిపిన రాజాసింగ్… జైలుకు పోతే ముందు ఈ వస్తువులు తీసుకెళ్లమని లిస్ట్ కూడా రెడీ చేశారు. ఆ లిస్ట్ లో నాలుగు జతల బట్టలు , ఒక దుప్పటి, టవల్, హ్యాండ్ కర్చీఫ్ , సబ్బు, పచ్చడి ప్యాకెట్, స్వెట్టర్ తీసుకెళ్లమంటూ వ్యంగ్యంగా చెప్పారు. అంతేకాకుకండా ఎవరైతే అన్యాయంగా వేరొకరిని అరెస్ట్ చేసి జైలుకు పంపుతారో చివరికి వాళ్లు కూడా అదే విధంగా జైలుకు పోవాల్సి వస్తుందని తెలిపారు. ప్రస్తుతం రాజాసింగ్ ట్వీట్ వైరల్ గా మారింది.
Karma doesn’t forget
I have been thrown in jail by both the Congress and BRS/TRS governments after they filed false cases against me. I know exactly how the game works.
So, @KTRBRS ji, here’s a little checklist to pack before heading to jail:
👉Four sets of clothes – fashion…
— Raja Singh (@TigerRajaSingh) January 16, 2025
కాగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సైతం వీరిద్దరి మధ్య మాటల యుద్ధమే జరిగింది. ధనిక రాష్ట్రంగా చెబుతున్న తెలంగాణలో… కేసీఆర్ సర్కార్ ఓల్డ్ సిటీలో చేసిన అభివృద్ధి మంత్రి కేటీఆర్ బైక్‌పై పర్యటించి తెలుసుకోవాలని రాజాసింగ్ అప్పట్లో సవాలు విసిరారు. చిన్నపాటి వర్షానికి ఓల్డ్ సిటీ ప్రాంతంలో రహదారులు, దుకాణాలు మునిగిపోతున్నాయని.. ఇళ్లలోకి భారీగా నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ పేర్కొన్నారు.
ఈ ట్వీట్ పై అప్పట్లో కేటీఆర్ కూడా రెస్పాండ్ అయ్యారు. ముందు పెట్రోల్ బంక్ దగ్గర ఆగి.. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలపై ప్రజలు ఏమంటున్నారో తెలుసుకోవాలని కౌంటర్ ఇచ్చారు. ఎల్పీజీ ధరలపైనా ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలని.. బీజేపీ పాలనలో జీడీపీ అంటే గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెరగడమా..? అంటూ ప్రశ్నించారు. మాటల గారడీ ఆపేసి.. మంచి పనులతో ఓటర్ల హృదయాలు గెలుచుకోవాలని రీట్వీట్ చేశారు కేటీఆర్.
ఇక బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో తనపై అన్యాయంగా కేసులు పెట్టి.. అరెస్ట్ చేయించిందని రాజాసింగ్ మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా… అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో రాజా సింగ్‌పై కేసు నమోదైంది. అసిస్టెంట్ చీఫ్ ఎలక్టోరల్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫిబ్రవరి 19, 2022న మంగళ్‌హట్ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదు కాగా… ఆగస్టు 25, 2022న పోలీసులు రాజాసింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇక శ్రీరామనవమి శోభాయాత్రలో రెచ్చగొట్టేలా పాట పాడారని సైతం కేసులు నమోదు కాగా.. మరోసారి అతనిపై చర్యలు తీసుకోవాలంటూ ఎంఐఎం శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో రాజాసింగ్ ను పలుమార్లు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే బీఆర్ఎస్ తనపై కుట్ర పన్ని తప్పుడు కేసులు పెట్టించిందని ఆయన ఆరోపించారు.
ALSO READ : ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంలో బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు..