E-Paper
Advertisement

Brahmanandam: బ్రహ్మానందం ఆస్తుల విలువ అన్ని కోట్లా.. తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..?

Brahmanandam: బ్రహ్మానందం ఆస్తుల విలువ అన్ని కోట్లా.. తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..?
Advertisement

Brahmanandam: బ్రహ్మానందం.. ఈ పేరు వినగానే ప్రేక్షకుల్లో ఓ రకమైన ఆనందం. ఎదుటివారిని నవ్వించడం బ్రహ్మానందంకి వెన్నతో పెట్టిన విద్య. ఆయన్ను చూస్తే చాలు ఉన్నపళంగా నవ్వేయాలనిపిస్తుంది. ఆయన ముఖంలో అంతటి కళ ఉంటుంది మరి. గత పది సంవత్సరాల క్రితం ఇండస్ట్రీలో ఆయన లేని సినిమా లేదు.. ఆయన నవ్వించలేని పాత్ర లేదు. అంతటి క్రేజ్ ఏ హీరోకు గాని, ఏ దర్శకుడికి గాని లేదు.. ఒక్క బ్రహ్మానందంకి తప్ప. ఆయన డేట్ల కోసం దర్శక నిర్మాతలు క్యూ కట్టేవారు.

అయితే ఈ మధ్య వయసు రీత్యా అనారోగ్యం సమస్యలతో సినిమాలకు దూరంగా ఉన్నారు. కేవలం ప్రాధాన్యత ఉన్న పాత్రలో మాత్రమే నటిస్తున్నారు. ఇదంతా ఇప్పుడెందుకు అనుకుంటున్నారా.. ఈ రోజు బ్రహ్మానందం బర్త్ డే. ఆయన 68వ పుట్టిన రోజును జరుపుకోబోతున్నారు. కాబట్టి ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు మీ కోసం..

Advertisement

బ్రహ్మానందం మొదటిగా నరేష్ హీరోగా నటించిన శ్రీ తాతావతారం అనే మూవీతో నటుడిగా ఆరంగేట్రం చేశారు. ఆ తర్వాత ఆహనా పెళ్లంట సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆపై ఆయన మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఒక్కొక్క పాత్రతో తన మార్క్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. తిరిగులేని కమెడియన్‌గా పేరు సంపాదించుకున్నారు. ఆయన్ని ఎలా చూసినా ఆడియన్స్ ముఖంలో నవ్వులే నవ్వులు.

దాదాపుగా 1250కి పైగా సినిమాలలో నటించిన బహ్మానందం 2010లో పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. సినీ దర్శక నిర్మాతలకే కాదు టాప్ మోస్ట్ హీరోలకు కూడా ఆయన ఒక ఫేవరేట్‌గా మారిపోయాడు. ఆయన వలనే చాలా సినిమాలు హిట్ అయ్యాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Advertisement

ఇదంతా ఒకెత్తయితే ఇన్నేళ్లలో ఆయన ఎంత సంపాదించి ఉంటారు. ఆయన ఆస్తుల విలువ ఎంత ఉంటుంది అనే ఆలోచన అందరి మెదల్లో మెదులుతూనే ఉంది. ఈ క్రమంలో వాటికి సంబంధించిన ఓ వార్త కూడా తెగ వైరల్ అవుతోంది. నిజానికి బ్రహ్మానందం తనకు వచ్చే రెమ్యునరేషన్లో కొంత భాగాన్ని భూములపై ఇన్వెస్ట్ చేసేవారట. అలాగే ఆయన చేసిన పొదుపుల వల్ల కూడా మరింత స్థిరాస్తిని కూడబెట్టుకున్నారట. అలా ఆయన ఆస్తి ఇప్పుడున్న ధరలో దాదాపుగా రూ.750 కోట్ల వరకు ఉంటుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ విషయం తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×