BigTV English

Union Budget 2024 : బడ్జెట్‌ వేళ.. కేంద్రం కీలక నిర్ణయం..!

Union Budget 2024 : బడ్జెట్‌ వేళ.. కేంద్రం కీలక నిర్ణయం..!
Union Budget 2024 updates

Union Budget 2024 updates(Live tv news telugu):

మరికాసేపట్లో కేంద్ర బడ్జెట్ దేశం లోక్‌సభకు రానున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మొబైల్స్ ఉత్పత్తిలో వాడే విడి భాగాలపై దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది. సిమ్ సాకెట్లు, మెటల్ భాగాలు, సెల్యులార్ మాడ్యూల్స్, ఇతర మెకానికల్ వస్తువులపై దిగుమతి సుంకాన్ని ఇప్పుడు 5 శాతం తగ్గించనున్నట్లు కేంద్రం ప్రకటించింది.


మిడిల్ కవర్, మెయిన్ లెన్స్, బ్యాక్ కవర్, జీఎస్‌ఎం యాంటెన్నా, పీయూ కేస్, సీలింగ్ గాస్కెట్, సిమ్‌ సాకెట్, స్క్రూలు, ఇతర ప్లాస్టిక్, మెటల్ మెటీరియల్‌లపై కూడా దిగుమతి సుంకాన్ని తగ్గించింది. కాగా.. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మీద కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధానికి, ఆర్థిక మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. తాజా నిర్ణయంతో దేశీయ ఫోన్‌ తయారీ కంపెనీలకు మరింత ఊరట కలుగనుందని అశ్వనీ వైష్ణవ్ అభిప్రాయపడ్డారు. దీనివల్ల మొబైల్‌ఫోన్ల ధరలూ తగ్గనున్నాయని, మేక్ ఇన్ ఇండియా ప్రయత్నం మరింత ముందుకు పోనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×