BigTV English

Pushpa 2 : బన్నీ – సుకుమార్ మధ్య వివాదం.. ఫుల్ క్లారిటీ వచ్చేసింది..!

Pushpa 2 : బన్నీ – సుకుమార్ మధ్య వివాదం.. ఫుల్ క్లారిటీ వచ్చేసింది..!

Sukumar vs Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప’ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాతో అల్లు అర్జున్ ఏకంగా నేషనల్ అవార్డునే సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సెన్సేషనల్ కలెక్షన్లతో రికార్డుల వర్షం కురిపించింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్‌ని మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ మూవీ ఫుల్ స్వింగ్‌లో ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్ ఫుల్ హైప్ క్రియేట్ చేశాయి.


ఇందులో బన్నీ లుక్ మరింత స్టైలిష్ అండ్ రగ్గడ్ లుక్‌లో కనిపించి అదరగొట్టేసింది. దీంతో ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకాభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ సినిమాను ముందుగా ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. కానీ సినిమాకు సంబంధించి మరికొంత వర్క్ పెండింగ్ ఉండటంతో ఇటీవలే రిలీజ్ డేట్‌ను వాయిదా వేశారు. ఈ సారి పక్కాగా అన్ని పనులు కంప్లీట్ చేసి డిసెంబర్ 6న గ్రాండ్ లెవెల్లో విడుదల చేయనున్నట్లు తెలిపారు.

దీంతో తమ అభిమాన హీరో సినిమా మరికొద్ది రోజుల్లో రిలీజ్ అవుతుందని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి కొన్ని రూమర్స్ తరచూ బయటకొస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ విషయంలో అల్లు అర్జున్ అండ్ దర్శకుడు సుకుమార్‌కు మధ్య కొన్ని విభేదాలు తలెత్తాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. మూడు యూనిట్లతో షూటింగ్ చేయించాలని అల్లు అర్జున్ కోరితే.. సుకుమార్ మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. దీని కారణంగానే వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని అంటున్నారు. దీంతో సుకుమార్ ఎంత చెప్పినా వినకుండా బన్నీ గడ్డం చేయించాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.


Also Read: రామోజీ ఫిల్మ్ సిటీలో ‘పుష్ప 2’ సందడి..శరవేగంగా షూటింగ్!

అయితే తాను ఎంత చెప్పినా వినకుండా బన్నీ గడ్డం చేయించాడని హర్ట్ అయిన సుకుమార్ అమెరికా వెకేషన్‌కి వెళ్లిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయం తెలిసిన బన్నీ కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బన్నీ కూడా తమ ఫ్యామిలీతో కలిసి యూరప్ ట్రిప్‌కి పయణమయ్యాడని కొన్ని రూమర్స్ వస్తున్నాయి. అయితే వీటిపై తాజాగా అల్లు అర్జున్ టీం స్పందించింది. ఇందులో భాగంగా బన్నీ టీంకి చెందిన శరత్ చంద్ర అనే వ్యక్తి అసలు మ్యాటర్‌ను తెలిపాడు.

ఈ మేరకు ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. సుకుమార్ పుష్ప 2 సినిమా ఎడిటింగ్ స్టార్ట్ చేశాడని.. మొదటి పార్ట్ ఎడిటింగ్ చేస్తున్న తరుణంలోనే కాస్త బ్రేక్ తీసుకున్నాడని తెలిపాడు. అయితే ఎడిటింగ్ సమయంలో బ్రేక్ తీసుకోవడం చాలా సాధరణమైన విషయమనే చెప్పాడు. అయితే దానికి మరొక అభిమాని స్పందిస్తూ.. షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకోవచ్చు కదా.. ఇప్పుడెందుకు అని కామెంట్ చేయగా.. ఇప్పుడు చాలా టైం ఉంది. అందువల్ల ఫస్ట్ హాఫ్ కంప్లీట్ చేసి కంప్యూటర్ గ్రాఫిక్స్ పనులు అంతా రెడీ చేసి మిగతా ఎడిటింగ్ షూటింగ్ తర్వాత చేసుకోవచ్చు అని అన్నాడు. దీంతో హ్యాపీగా డిసెంబర్ 6న ఈ సినిమాని రిలీజ్ చేయవచ్చు అని తెలిపాడు. దీంతో బన్నీ- సుకుమార్ మధ్య విభేదాలు తలెత్తాయన్న వార్తలకు చెక్ పెట్టినట్లయింది.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×