BigTV English

Pushpa 2: రామోజీ ఫిల్మ్ సిటీలో ‘పుష్ప 2’ సందడి..శరవేగంగా షూటింగ్!

Pushpa 2: రామోజీ ఫిల్మ్ సిటీలో ‘పుష్ప 2’ సందడి..శరవేగంగా షూటింగ్!

Pushpa 2: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2’. ఈ మూవీని పాన్ ఇండియా లెవల్‌లో తీసుకొస్తున్నారు. పుష్ప సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మిస్తుండగా.. ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సింగ్ సూసేకి అగ్గి రవ్వ.. సాంగ్ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. తాజాగా, హైదరాబాద్‌లో కీలక సీన్లకు సంబంధించిన షూటింగ్ జరుగుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.


కీలక సీన్లు 
పుష్ప సినిమాతో అలరించిన పుష్పరాజ్.. ఈసారి రెట్టించిన ఉత్సాహంతో పుష్ప 2 తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతున్నాయి. గ్రామీణ నేపథ్యంలో సాగే సన్నివేశాలతో పాటు పలు కీలక సీన్లను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా అల్లు అర్జున్‌తో పాటు ఇతర పాత్రధారులపై ఈ సన్నివేశాల షూటింగ్ జరుగుతున్నట్లు మేకర్స్ తెలిపారు.  కాగా, పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పాత్రకు జాతీయ ఉత్తమ నటుడది పురస్కారం వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక, ఈ సినిమాను ఇండిపెండెన్స్ కానుకగా ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ మూవీ విడుదల తేదీ వాయిదా పడనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
వాయిదా పడుతుందా?
పుష్ప 2 సినిమాకు సంబంధించి మేకర్స్ ఇప్పటికే రిలీజ్ తేదీని విడుదల చేశారు. మొదట షూటింగ్ పనులు జూన్ చివరి వరకు పూర్తి చేయాలని అనుకున్నారు. అయితే షూటింగ్ పూర్తి కావడానికి ఇంకా 30 రోజులు సమయం పడడంతో వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే కొన్ని ఎపిసోడ్‌లను సుకుమార్ రీడిజైన్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో షూటింగ్ ఆలస్యమైందని సమాచారం. మరోవైపు వీఎఫ్ఎక్స్ విషయంలో సుకుమార్ అసంతృప్తిగా ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అందుకే సినిమా విడుదల వాయిదా వేసే అవకాశం ఉందని సినీ వర్గాల్లో వార్త వైరల్ అవుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×