E-Paper
Advertisement

Allu Arjun : ‘పుష్ప 2’లో హీరో మెయిన్ డైలాగ్ లీక్ చేసిన బన్నీ

Allu Arjun : ‘పుష్ప 2’లో హీరో మెయిన్ డైలాగ్ లీక్ చేసిన బన్నీ
Advertisement

Allu Arjun : ద‌క్షిణాది సినిమాగా రిలీజై పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేష‌న‌ల్ హిట్ సాధించిన సినిమాల్లో పుష్ప ది రైజ్ సినిమా ఒక‌టి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ మూవీకి కొన‌సాగింపుగా ‘పుష్ప 2 ది రూల్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ త్వరలోనే షూటింగ్ కోసం యూనిట్‌తో జాయిన్ కాబోతున్నారు. ఈ సినిమా గురించి అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా గురించి ఓ డైలాగ్‌ను బ‌న్నీ ‘ఊర్వశివో రాక్షసివో’ మూవీ థాంక్స్ మీట్‌లో చెప్పేశారు. ఇప్పుడా వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది.

‘పుష్ప ది రైజ్‌’ చిత్రంలో హీరో పాత్రధారి తగ్గేదే లే అని చెప్పే డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. మ‌రి పార్ట్ 2గా వ‌స్తున్న ‘పుష్ప ది రూల్’ మూవీలో హీరోకి ఎలాంటి మేన‌రిజ‌మ్ డైలాగ్ ఉంటుందోన‌ని అంద‌రూ వెయిట్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ‘ఊర్వశివో రాక్షసివో’ ఈవెంట్‌లో బన్నీ మాట్లాడుతూ ‘‘పుష్ప‌లో ‘తగ్గేదే లే’ అయితే పుష్ప 2లో ‘అస్సలు తగ్గేదే లే’’’ అన్నారు. అంటే హీరో అస్సలు తగ్గేదే లే అనే డైలాగే మేనరిజమ్‌గా ఉండబోతుందని అర్థమవుతుంది.

Advertisement

ఎర్ర చంద‌నం కూలీగా వ‌చ్చిన పుష్ప‌రాజ్ సిండికేట్ కింగ్‌గా మారేంత వ‌ర‌కు పుష్ప ది రైజ్‌లో చూపించిన సుకుమార్.. పుష్ప ది రూల్ లో పుష్ప‌రాజ్‌కి.. బైరాంసింగ్ షెకావ‌త్‌కి మ‌ధ్యన ఉండే ఇగో క్లాషెస్‌ను చూపింబచ‌బోతున్నారు. వ‌చ్చే ఏడాదిలోనే సినిమా రిలీజ్ అవుతుంది.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×