BigTV English

Varun Tej @ Election Campaign 2024: బాబాయ్‌ పవన్‌కల్యాణ్‌ తరపున ప్రచారం.. వరుణ్‌ తేజ్‌ క్లారిటీ!

Varun Tej @ Election Campaign 2024: బాబాయ్‌ పవన్‌కల్యాణ్‌ తరపున ప్రచారం.. వరుణ్‌ తేజ్‌ క్లారిటీ!

Varun Tej Clarity about Election Campaign 2024: వరుణ్‌ తేజ్‌, మానుషి చిల్లర్‌ జంటగా నటించిన చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’. సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా విజయవాడలో వరుణ్ తేజ్‌ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కుటుంబ సభ్యుల ఆదేశిస్తే.. తన బాబాయ్‌ పవన్‌కల్యాణ్‌ తరఫున ప్రచారానికి వెళ్తానని తెలిపారు. తన బాబాయ్‌తో కలిసి నటించడం ఇష్టం అన్నారు. కానీ అలాంటి కథలేవీ ప్రస్తతం లేవని వివరించాడు.


పవన్ కల్యాణ్ సిద్ధాంతాలు, ఎంచుకునే మార్గాలపై నమ్మకం ఉందని వరుణ్ తేజ్ అన్నాడు. గత ఎన్నికల్లో కూడా తండ్రి నాగబాబుతో కలిసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనట్లు తెలిపాడు. తండ్రి నాగబాబుకు బాబాయ్‌ పవన్‌ కల్యాణ్‌కు తాను ఎప్పుడు సపోర్ట్‌ చేస్తానని వరణ్‌ తెలిపారు.

శక్తి ప్రతాప్‌ సింగ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’. మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే చిత్రీకరణ పనులు పూర్తి చేసుకుంది. చిత్రబృందం ప్రచార కార్యక్రమాలు కూడా మొదలు పెట్టింది. ఈ సందర్భంగా చిత్రబృందం విజయవాడలో సందడి చేసింది.


Read More: మెగాస్టార్ ‘విశ్వంభర’లో మరో హీరోయిన్.. ఛాన్స్ కొట్టేసిన యంగ్ బ్యూటీ..!

పూర్తిగా దేశభక్తి నేపథ్యంలోనే ఈ సినిమా సాగుతోందని వరుణ్‌ తెలిపాడు. ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌కు సంబంధించి తెలుగులో సినిమాలు లేవు కాని ఆ లోటును ‘ఆపరేషన్ వాలెంటైన్’ తీర్చనుందని అన్నారు. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్‌ డే రోజు జరిగిన పుల్వామా ఘటన నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కినట్లు తెలిపాడు. అందుకే ఈ మూవీకి ‘ఆపరేషన్ వాలెంటైన్’ అని పేరు పెట్టినట్టు వివరించాడు.

Related News

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

Big Stories

×