E-Paper
Advertisement

Jani Master: జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు.. ఎవరు ఆమె?

Jani Master: జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు.. ఎవరు ఆమె?
Advertisement

Case Filed On Choreographer Jani Master: ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ, కన్నడ సినిమాలకు కూడా తన డాన్స్ తో అలరించారు. ఇండస్ట్రీలో అందరు అగ్ర హీరోలతో స్టెప్పులు వేయించారాయన.

ఇప్పటికే టాలీవుడ్, కోలీవుడ్‌లో , శాండిల్‌వుడ్‌లో.. స్టోరీతో పాట ఉంటే ఆ సాంగ్‌కు కొరియోగ్రాఫర్‌గా ఇంక ఎవరు వద్దని మాకు జానీ మాస్టర్ కావాలని దర్శకులు ఫేవరేట్ గా అడుగుతారు. అంత సెంటిమెంట్ స్టెప్పులతో కూడా పండిస్తారాయన. అందుకే అంత గొప్ప డాన్స్ మాస్టర్ అయ్యారు. ఈ మధ్య కాలంలో 70వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా అవార్డు అందుకున్నారు.

Advertisement

ఇక కెరీర్ సాఫీగా సాగుతున్న వేళ  జానీ మాస్టర్ పై లైంగిక వేధింపులు కేసు నమోదైంది. గత కొంతకాలంగా తనపై జానీ మాస్టర్.. లైంగిక దాడి చేస్తున్నారంటూ 21 ఏళ్ల మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులను ఆశ్రయించింది. ఔట్ డోర్ షూటింగ్స్ లలో తనపై అత్యాచారం చేశాడంటూ రాయ్ దుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీనిపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రాయ్ దుర్గం పోలీసులు.. నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కి ట్రాన్స్ ఫర్ చేసినట్టు సమాచారం.

గత కొంతకాలంగా జానీ మాస్టర్ టీమ్ లో కొరియోగ్రాఫర్ గా చేస్తున్నా అని బాధిత యువతి చెబుతోంది. చెన్నై, ముంబై లలో ఔట్ డోర్ షూటింగ్స్ లతో పాటు.. హైదరాబాద్ నార్సింగ్ లోని తన ఇంటి లో సైతం.. జానీ మాస్టర్ తనపై పలుమార్లు లైంగిక దాడి చేశాడని వాపోతుంది. ఈ క్రమంలోనే జానీ మాస్టర్ పై మూడు సెక్షన్ ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Also Read: ప్రియుడితో ఏడడుగులు వేసిన నితిన్ హీరోయిన్.. ఫొటోలు వైరల్

సెక్షన్ 376, సెక్షన్ 506, 323 సెక్షన్ ల కింద కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్టు నార్సింగ్ పోలీసులు వెల్లడించారు. అలానే ఇదే విషయంపై విమెన్ సేఫ్టీ వింగ్ డిజీ షికా గోయల్‌ని.. పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు సైతం కలిసినట్టు చర్చ జరుగుతోంది. 2019 లో సైతం జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు అయినట్టు తెలుస్తోంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×