BigTV English
Advertisement

Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ.. ఇండియా ‘ఏ’ టీం తొలి విజయం

Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ.. ఇండియా ‘ఏ’ టీం తొలి విజయం

India A win by 186 runs against India D in Duleep Trophy: దులీప్ ట్రోఫీలో ఇండియా ‘ఏ’ టీం తొలి విజయం నమోదు చేసుకుంది. ఆదివారం ఆర్డీటీ స్పోర్ట్స్ సెంటర్‌లో ఇండియా ‘డి’తో జరిగిన మ్యాచ్‌లో 186 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. 488 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా డి టీం 301 పరుగులకే ఆలౌటైంది.


అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 62/1తో ఇండియా ‘డి’ నాలుగో రోజు మొదట గెలుపు దిశగా సాగిన మ్యాచ్.. చివరిలో కీలక వికెట్లు కోల్పోవడంతో తర్వాత బ్యాటర్లు తడబడ్డారు. తెలుగు తేజం రికీ భుయ్ విరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. 195 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లతో 113 పరుగులు చేయగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 55 బంతుల్లో 8 ఫోర్లతో 41 పరుగులు, సంజు శాంసన్ 45 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 40 పరుగులతో రాణించారు.

అయితే, మిగతా బ్యాట్స్‌మెన్లు ఘోరంగా విఫలం కావడంతో ఇండియా ‘డి’కి ఓటమి తప్పలేదు. ఇక, ఇండియా ‘ఏ’ బౌలర్లలో తనుష్ కొటియన్ 4 వికెట్లు పడగొట్టగా, ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్లు, ఖలీల్ అహ్మద్, రియాన్ పరాగ్ తలో వికెట్ పడగొట్టారు.


తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా ‘ఏ’ టీం 290 పరుగులు ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 380 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఇక, ఇండియా ‘డి’ టీం తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకు ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్ ‌లో 301 పరుగులకే ఆలౌటైంది. ఇండియా ‘ఏ’ టీంలో ఆల్ రౌండర్ సామ్స్ ములానీ 89 పరుగులు చేయడంతోపాటు తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్, రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీయడంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

Also Read: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ఓపెనర్..13ఏళ్ల రికార్డు బ్రేక్

ఇదిలా ఉండగా, ఇండియా ‘సి’ , ఇండియా ‘బి’ మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆదివారం ఐదోరోజు 309/7 స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఇండియా ‘బి’ టీం 332 పరుగులకు ఆలౌటైంది. అభిమన్యు ఈశ్వరన్ 286 బంతుల్లో 14 పోర్లు, సిక్స్‌తో 157 పరుగులు చేశాడు. ఇండియా ‘సి’ బౌలర్లలో అంశుల్ కాభోజ్ ఏకంగా 8 వికెట్లు పడగొట్టాడు.

అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇండియా ‘సి’ టీం 128/4 వద్ద డిక్లేర్ చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 93 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 62 పరుగులు, రజత్ పటిదార్ 84 బంతుల్లో 5 పోర్లతో 42 పరుగులు చేశాడు. ఇక, ఇండియా ‘బి’ రెండో ఇన్నింగ్స్ ఆడినా ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా ‘సి’ 525 పరుగులు చేసింది. ఇందులో 8 వికెట్లతోపాటు 38 పరుగులు చేసిన అన్షుల్ కాంబోజ్ ప్లేయర్ ఆప్ ద మ్యాచ్‌గా ఎన్నికయ్యారు.

Related News

Anushka-Kohli: కోహ్లీ – అనుష్క శర్మ విడాకులు ?సోష‌ల్ మీడియాలో దారుణంగా పోస్టులు

WPL Retention 2026 : రిటైన్ లిస్టు ఇదే..WPL 2026 టోర్న‌మెంట్ షెడ్యూల్ ఇదే..!

IND VS AUS 4th T20I : వాషి యో వాషి..3 వికెట్లు తీసిన వాషింగ్ట‌న్‌, కంగారుల‌పై టీమిండియా విజ‌యం

Kajal Aggarwal: టీమిండియా మ్యాచ్ కు కాజ‌ల్‌..భ‌ర్త‌ను హ‌గ్ చేసుకుని మ‌రీ, ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే

Tata Motors: వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన టీమిండియా ప్లేయ‌ర్ల‌కు టాటా బంప‌ర్ ఆఫ‌ర్‌

PV Sindhu: బోల్డ్ అందాలతో రెచ్చిపోయిన PV సింధు.. వెకేషన్ లో భర్తతో రొమాన్స్

IND VS AUS, 4th T20I: టాస్ ఓడిన టీమిండియా..మ్యాక్స్‌వెల్ తో పాటు 4 గురు కొత్త‌ ప్లేయ‌ర్లు వ‌చ్చేస్తున్నారు

Harleen Deol: మోడీ సార్‌.. ఎందుకు ఇంత హ్యాండ్స‌మ్ గా ఉంటారు? హర్లీన్ డియోల్ ఫ‌న్నీ క్వ‌శ్చ‌న్‌

Big Stories

×