BigTV English

Megha Akash: ప్రియుడితో ఏడడుగులు వేసిన నితిన్ హీరోయిన్.. ఫొటోలు వైరల్

Megha Akash: ప్రియుడితో ఏడడుగులు వేసిన నితిన్ హీరోయిన్.. ఫొటోలు వైరల్

Megha Akash: సినీ ఇండస్ట్రీలో లవ్ మ్యారేజెస్ కామన్. కొందరు సినీ ఫీల్డ్‌లో ఉన్న వారిని లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంటే.. మరి కొందరు ఎరేంజ్‌డ్ మ్యారేజ్ చేసుకుంటారు. అయితే ఎక్కువగా ప్రేమ వివాహాలే జరగడం చూశాం. తాజాగా అలాంటిదే టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ పెళ్లి పీటలెక్కింది. ఎన్నో చిత్రాలతో తెలుగు సినీ ప్రియుల్ని తన అందాలతో కట్టిపడేసింది. లై, ఛల్ మోహన్ రంగ, రాజరాజ చోర, ప్రేమదేశం, గుర్తుందా శీతాకాలం, రావణాసుర, బూ సహా మరెన్నో తెలుగు చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది.


ఇలా ఎన్ని సినిమాలు చేసినా పెద్దగా స్టార్ హీరోయిన్ హోదా సంపాదించుకోలేకపోయింది. అయినా తన ప్రయత్నాన్ని ఆపలేదు. ఇప్పుడు మరో రెండు తెలుగు సినిమాలు చేస్తుంది. ఇలా వరుస సినిమాలతో అభిమానులను అలరిస్తున్న మేఘా తాజాగా తన ఫ్యాన్స్ ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ అందించింది. తన బాయ్ ఫ్రెండ్ సాయి విష్ణుని మ్యారేజ్ చేసుకుంది. కాగా ఈ అందాల ముద్దుగుమ్మ పెళ్లికి సంబంధించిన వార్తలు గతకొంతకాలంగా చక్కర్లు కొట్టాయి. ఆమె లవ్‌లో ఉందని.. త్వరలో మ్యారేజ్ కూడా చేసుకోబోతుంది అంటూ వార్తలు వచ్చాయి.

Also Read: ఇప్పటినుండి అన్నా అని పిలుస్తా, ఇది నువ్వు ఫిక్స్ అయిపో.. సైమా స్టేజ్‌పై నాని, విజయ్


కానీ వీటిపై ఎప్పుడూ ఆమె స్పందించలేదు. అయినా వార్తలు ఆగలేదు. చివరికి గాసిప్స్ వార్తలు ఇప్పుడు నిజమయ్యాయి. మేఘా ఆకాశ్ తాజాగా తన బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ భాయ్ చెప్పి.. జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఎప్పట్నుంచో సీక్రెట్‌గా రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తున్న సాయి విష్ణుతో కలిసి ఏడడుగులు వేసింది. అందుకు సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది.

‘ఇది నా జీవితంలో ఫేవరేట్ చాప్టర్’ అంటూ క్యాప్షన్ ఇచ్చి తన రిసెప్షన్‌కు సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో కొత్త దంపతులు ఎంతో ఆనందంగా, అన్యోన్యంగా కనిపిస్తున్నారు. కాగా వీరి పెళ్లి చెన్నైలోని ఓ ప్రముఖ ఫంక్షన్ హాల్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి ఎంతోమంది సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఆయన కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ హాజరై కొత్త దంపతులను ఆశీర్వదించారు. అంతేకాకుండా వీరితో పాటు మరికొంతమంది డీఎంకే మంత్రులు సైతం హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన రిసెప్షన్ ఫొటోలు, పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎంతోమంది సెలబ్రిటీలు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Related News

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

Big Stories

×