BigTV English

Allu Arjun – Chandra Bose’s wife: బన్నీ కాళ్ళ ముందు పడ్డ ఆస్కార్ అవార్డు గ్రహీత భార్య.. అసలేమైందంటే..?

Allu Arjun – Chandra Bose’s wife: బన్నీ కాళ్ళ ముందు పడ్డ ఆస్కార్ అవార్డు గ్రహీత భార్య.. అసలేమైందంటే..?

Allu Arjun – Chandra Bose’s wife: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు అర్జున్ (Allu Arjun). ముఖ్యంగా సుకుమార్(Sukumar)దర్శకత్వంలో వచ్చిన పుష్ప(Pushpa) సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. దీనికి తోడు ఏకంగా ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కూడా అందుకున్నారు.అంతేకాదు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరో కూడా ఈయనే కావడం గమనార్హం. ఇకపోతే అల్లు అర్జున్ పుష్ప సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.పుష్ప 2(Pushpa 2)గా విడుదలైన ఈ సినిమా డిసెంబర్ ఐదవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 12 వేలకు పైగా థియేటర్లలో విడుదలై ఈ చిత్రం .. మొదటి రోజే ఊహించని విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా విడుదలైన మొదటి రోజు రూ.294 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది


చంద్రబోస్ భార్య చేసిన పనికి షాక్ లో బన్నీ..

ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా చరిత్ర సృష్టించింది పుష్ప 2. విడుదలైన వారంలోపే రూ.1000 కోట్ల క్లబ్లో చేరి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇదిలా ఉండగా తాజాగా అల్లు అర్జున్ కి సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా ప్రముఖ ఆస్కార్ గ్రహీత చంద్రబోస్ (Chandrabose)భార్య అల్లు అర్జున్ పాదాల వద్ద పడి నమస్కరించింది అని తెలుస్తోంది.అంతేకాదు అందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది.మరి అసలు ఏం జరిగిందో?ఇప్పుడు చూద్దాం.


జాతర సీక్వెన్స్ కి సుచిత్ర ఫిదా..

అసలు విషయంలోకి వెళ్తే పుష్ప-2 సినిమా మళ్లీ మళ్లీ చూసేలా చేసింది మాత్రం ఈ సినిమాలో వచ్చే జాతర సన్నివేశం. ఈ సన్నివేశంలో అల్లు అర్జున్ అద్భుతమైన నటన, దేవిశ్రీప్రసాద్ మతి పోగొట్టే మ్యూజిక్ ఆడియన్స్ కి రోమాలు నిక్కబొడుచుకునేలా చేశాయని చెప్పవచ్చు. ముఖ్యంగా మాతంగి గెటప్ లో అల్లు అర్జున్ ఇరగదీసారు.ఇక అందుకే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ సన్నివేశం చూడడానికైనా థియేటర్లకి తరలి వస్తున్నారు. ఇంకొంతమంది మహిళలకైతే నేరుగా థియేటర్లలో అమ్మవారు పూనిన సందర్భాలు కూడా మనం చూసాము.

బన్నీ జీవితంలో మరువని ఘటన..

ఇక ఇదంతా పక్కన పెడితే.. తాజాగా ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ సతీమణి సుచిత్ర చంద్రబోస్ (Suchitra Chandrabose)అల్లు అర్జున్ ని కలిసి ఆయన పాదాల వద్ద మోకాళ్ళ మీద కూర్చొని దండం పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.తన భర్త ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి..ఆయన ప్రతిభకు ఆస్కార్ కూడా వచ్చింది.అలాంటి వ్యక్తి భార్య ఇలా అల్లు అర్జున్ ముందు మోకాళ్ళ మీద పడి దండం పెట్టడం అంటే ఆయన సాధించిన ఘనత ఈ ఘటన ముందు తేలిపోవాల్సిందే. ఏదేమైనా ఎంతమందికి ఇలాంటి అదృష్టం వస్తుంది? కచ్చితంగా అల్లు అర్జున్ కి 2వ నేషనల్ అవార్డు రావడం తధ్యం అని కూడా బాలీవుడ్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇంకొంతమంది మాత్రం ఇంకా నేషనల్ అవార్డు వద్ద బన్నీ ఆగితే అవమానకరమని, ఏకంగా ఆస్కార్ టార్గెట్ పెట్టుకొని రంగంలోకి దిగాలని కూడా కోరుతున్నారు.

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Big Stories

×