Kanchana 4 : బుట్ట బొమ్మ పూజ హెగ్డే (Pooja Hegde) సౌత్ ఇండస్ట్రీకి దూరమై చాలా కాలమే అవుతుంది. ఈ బ్యూటీ ఖాతాలో వరుస డిజాస్టర్లు పడడంతో ఆమెను దూరం పెట్టేశారు టాలీవుడ్ మేకర్స్. దీంతో కొంతకాలం సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ గడిపిన ఈ బ్యూటీ మరోసారి ట్రాక్ లో పడినట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం బుట్ట బొమ్మ వరుస సినిమాలను లైన్లో పెడుతుంది. ఇప్పటికే ఆమె ఖాతాలో రెండు తమిళ సినిమాలు ఉండగా, మరో క్రేజీ హర్రర్ ఫ్రాంచైజీలో భాగం కాబోతుందని తెలుస్తోంది.
రాఘవ లారెన్స్ హీరోగా నటించిన ‘కాంచన’ ఫ్రాంచైజీకి మంచి క్రేజ్ ఉందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా హర్రర్ సినిమాలను ఇష్టపడేవారు ‘కాంచన 4’ (Kanchana 4) ఎప్పుడెప్పుడు తెరపైకి రాబోతుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రాఘవ లారెన్స్ ‘కాంచన 4’ మూవీ పనుల్లో తలమునకలై ఉన్నారు. ఈ మూవీని రాఘవ లారెన్స్ నిర్మించడమే కాకుండా దర్శకత్వం వహిస్తూ, హీరోగా నటిస్తున్నారు కూడా. తాజాగా ‘కాంచన 4’ మూవీలో ఫిమేల్ లీడ్ రోల్ కోసం పూజ హెగ్డేని కన్ఫామ్ చేశారని తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. కానీ ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ వచ్చే ఏడాది ఏప్రిల్ లేదంటే మేలో మొదలు కాబోతుందని తెలుస్తోంది.
అయితే నిజానికి ‘కాంచన’ ఫ్రాంచైజీలో ఎక్కువగా రాఘవ లారెన్స్ డామినేషన్ కన్పిస్తుంది. హీరోయిన్లు గ్లామర్ కోసమే అన్నట్టుగా కన్పిస్తారు ఈ హర్రర్ మూవీలో. ఇన్నాళ్లూ పూజా హెగ్డే (Pooja Hegde) ఫామ్ లో లేకపోవడానికి ముఖ్యమైన కారణం ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడమే. ఇలాంటి పాత్రలను ఎంచుకోవడం ఒక కారణం అయితే, పాన్ ఇండియా ఛాన్సులు వచ్చినా కాలం కలిసి రాకపోవడం మరో కారణం. మొత్తానికి పలు కారణాల వల్ల అవకాశాలు కరువైన పూజా ఇప్పుడు కాస్త గ్యాప్ ఇచ్చి వరుస సినిమాలతో తెరపై మెరవడానికి రెడీ అవుతోంది.
‘కాంచన 4’ సినిమాతో కలిపి మొత్తం పూజ హెగ్డే (Pooja Hegde) ఖాతాలో ఇప్పుడు మూడు తమిళ సినిమాలు ఉన్నాయి. దలపతి విజయ్ హీరోగా నటిస్తున్న ‘దలపతి 69’ అనే సినిమాలో హీరోయిన్ గా పూజా ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. విజయ్ కెరీర్ లో చివరి సినిమా ఇదే. ఇక రీసెంట్ గా ‘కంగువ’ సినిమాతో డిజాస్టర్ అందుకున్న నెక్స్ట్ మూవీ ‘సూర్య 44’ సినిమాలో కూడా హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది పూజా హెగ్డే. ఇలా వచ్చే ఏడాది మొత్తం పూజ హెగ్డే నామస్మరణ జరగబోతోంది. 2025 లో ఈ బ్యూటీ నటించిన రెండు సౌత్ సినిమాలు రిలీజ్ కాబోతుండడం విశేషం. మరి ఈ సినిమాలతో మరోసారి పూజ హెగ్డే సౌత్ లో తన హవా కొనసాగిస్తుందా ? రీఎంట్రీ మళ్లీ ఈ బ్యూటీకి కోరుకున్న సక్సెస్ ని తెచ్చి పెడుతుందా? ఈ మూడు సినిమాలు ఆమె కెరీర్ కు ఉపయోగపడతాయా ? అనేది చూడాలి.