AP Govt: ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. గత కొన్ని నెలలుగా ఖాతాలకు జమ కాకుండా ఉన్న నగదును తక్షణం వారి వారి ఖాతాలలో జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. గత పది నెలలుగా ఎదుర్కొంటున్న సమస్యను తక్షణం కూటమి ప్రభుత్వం పరిష్కరించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా దివ్యాంగ చిన్నారులకు, మానసిక వైకల్య బాధిత పిల్లలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు భవిత కేంద్రాలను గతంలో ఏర్పాటు చేశారు. అయితే ఈ భవిత కేంద్రాల ముఖ్య లక్ష్యం.. దివ్యాంగ చిన్నారులలో మానసిక స్థైర్యం కల్పించడంతో పాటు, వారికి ప్రత్యేక శిక్షణ అందించడమే. ఈ కేంద్రాలు దివ్యంగా చిన్నారులకు వరంగా ఉన్నాయని చెప్పవచ్చు. అయితే ప్రతినెల తమ చిన్నారులను విధిగా వారి తల్లిదండ్రులు కేంద్రాలకు తీసుకురావాల్సి ఉంది. అందుకై రవాణా చార్జీలను ప్రభుత్వమే భరిస్తుంది. ఒక్కొక్క విద్యార్థికి నెలకు రూ. 300 చొప్పున ప్రభుత్వం రవాణా చార్జీలను అందజేయాలి.
కానీ 10 నెలలుగా దివ్యాంగ చిన్నారుల తల్లిదండ్రుల ఖాతాకు డబ్బులు జమ కాకపోవడంతో, పలువురు తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ విషయాన్ని తెలుసుకున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు.. దివ్య అంటే చిన్నారులకు అందించే డబ్బులు జమలో సైతం గత ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం వహించిందా అంటూ అధికారులను నిలదీశారు. ఎన్ని నెలలు బకాయిలు ఉంటే అన్ని నెలల డబ్బులను వెంటనే వారి ఖాతాలో జమ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
Also Read: AP Govt – TG Govt: ఆ విషయంలో తెలంగాణను ఫాలో అవుతున్న ఏపీ
దీంతో పది నెలలుగా బకాయి పడ్డ రవాణా చార్జీల నగదును ఒక్కొక్కరికి రూ. 3000 చొప్పున ప్రభుత్వం జమ చేసింది. తమ కష్టాన్ని అర్థం చేసుకున్న ప్రభుత్వం నగదును ఖాతాలకు జమ చేయడంపై దివ్యాంగ తల్లిదండ్రులు ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. మరి మీ ఖాతా ఒకసారి చెక్ చేసుకోండి.. నగదు జమ అయిందో కాలేదో సరిచూసుకోండి.