BigTV English
Advertisement

Chandra Mohan: చిరంజీవి – అర‌వింద్‌ల‌పై చంద్ర‌మోహ‌న్ వ్యాఖ్య‌లు వైర‌ల్‌

Chandra Mohan: చిరంజీవి – అర‌వింద్‌ల‌పై చంద్ర‌మోహ‌న్ వ్యాఖ్య‌లు వైర‌ల్‌

Chandra Mohan : టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు మెగాస్టార్ చిరంజీవి, స్టార్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్‌ల‌పై సీనియ‌ర్ న‌టుడు చంద్ర‌మోహ‌న్ చేసిన వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. రీసెంట్‌గా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చిరు, అర‌వింద్ మ‌ధ్య ఉన్న అనుబంధం గురించి చంద్ర‌మోహ‌న్ చేసిన కామెంట్స్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. కురుక్షేత్రంలో అర్జునుడిని కృష్ణుడు చ‌క్క‌గా గైడ్ చేశారు. కృష్ణుడు సార‌థిగా లేక‌పోతే అర్జునుడు న‌థింగ్‌. అని అన్నారు చంద్ర‌మోహ‌న్‌. ఎలాంటి క్యారెక్ట‌ర్స్ వేయాలి. ఎంత రెమ్యున‌రేష‌న్ తీసుకోవాల‌నే విష‌యాల‌ను అర‌వింద్‌గారే చూసుకునేవారు. మారోజుల్లో అర‌వింద్‌ని కృష్ణుడినిగానూ, చిరంజీవిని అర్జునుడిగానూ సంబోధించే వాళ్లం.


ఓ యుద్ధానికి వెళ్లేట‌ప్పుడు అర్జునుడు కృష్ణుడు వైపు చూసేవాడ‌ని, అత‌ని ఆదేశాల మేర‌కు ముందుకు వెళ్లేవాడ‌ని అలాగే చిరంజీవి కూడా ఓ సినిమాను అంగీక‌రించేట‌ప్పుడు ఏ ప్రొడ‌క్ష‌న్ హౌస్‌లో చేయాలి? ఎంత రెమ్యున‌రేష‌న్ తీసుకోవాలి? ఎలాంటి పాత్ర‌లు ఎంచుకోవాల‌నే విష‌యాల‌ను అర‌వింద్‌గారే స్వ‌యంగా చూసుకునేవారు. ఆయ‌న స‌ల‌హాల‌ను చిరంజీవిగారు పాటించేవార‌ని అన్నారు. అర‌వింద్‌గారు లేక‌పోతే చిరంజీవిగారు స్టార్ హీరోగా ఎదిగి ఉండేవారు కాద‌ని ఇన్‌డైరెక్ట్‌గా కృష్ణుడు, అర్జునుడు పేర్ల‌ను చెబుతూ చంద్ర మోహ‌న్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో విలక్షణమైన పాత్రలతో మెప్పించిన చంద్ర మోహన్ ఇప్పుడు నాలుగైదేళ్లుగా చంద్రమోహన్ సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు. చెన్నైలోని ఇంట్లో ఉంటూ ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నారు.


Related News

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Big Stories

×