E-Paper
Advertisement

Mandaram Flower : జుట్టు సమస్యలకు మందార మందు

Mandaram Flower : జుట్టు సమస్యలకు మందార మందు
Advertisement

Mandaram Flower: ప్రస్తుతకాలంలో ప్రతిఒక్కరిని వేధిస్తున్న సమస్య జుట్టు రాలడం, తెల్లబడటం, చిట్లడం. అనేక మందికి ఈ సమస్యలు ఎదురవుతుంటాయి. వీటిని త‌గ్గించుకోవాలంటే మన పెరట్లో ఉండే మందార ఆకులు, పువ్వుల‌తో చక్కటి ఫలితం పొందవచ్చంటున్నారు నిపుణులు. మందార వల్ల వెంట్రుక‌ల స‌మ‌స్యలు దూరమవుతాయని చెబుతున్నారు. ఒక 8 చొప్పున మందార పువ్వులు, ఆకుల్ని కడిగి ముద్దలా చేసుకోవాలి. కప్పు కొబ్బరి నూనెను వేడిచేసి ఈ మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలుపుకోవాలి. నూనె చల్లారిన తర్వాత వడకట్టుకుని రాత్రి సమయంలో తలకు రాసుకుని ఉదయం తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే జుట్టుకు మంచి పోషకాలు అందుతాయి. గుప్పెడు మందార ఆకులు, నాలుగు పెద్ద చెంచాల పెరుగును తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. దీన్ని తలకు పట్టించి గంట తర్వాత త‌ల‌స్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే తెల్ల జుట్టు క్రమంగా నల్లబడుతుంది. మూడు చెంచాల ఉసిరిపొడి, రెండు చెంచాల ఉసిరిరసం, గుప్పెడు మందార ఆకులను తీసుకుని మెత్తగా చేసుకోవాలి. ఈ ముద్దను తలంతా పట్టించి 50 నిమిషాల తర్వాత కడిగితే జుట్టు చివ‌ర్లు చిట్లకుండా ఉంటాయి. ఒక గిన్నెలో గ్లాసు నీళ్లు పోసి వేడిచేయాలి. మరుగుతున్న నీళ్లలో గుప్పెడు మందార ఆకులు, అయిదారు పువ్వులు వేసి కొద్దిసేపు మరిగించాలి. చల్లారిన తర్వాత ఆకుల్ని ముద్దలా చేసి, కొద్దిగా శ‌న‌గపిండి కలిపితే షాంపూలా మారుతుంది. దీన్ని త‌ల‌కు రాసి షాంపూలా ఉప‌యోగించుకోవ‌చ్చు. 8 మందార పువ్వుల‌ను ముద్దలా నూరుకోవాలి. తర్వాత దీన్ని తలకు పట్టించి ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారంలో ఒకటి రెండు సార్లు చేయడం వల్ల జుట్టు స్మూత్‌గా మారుతుంది. ఈ మిశ్రమం కండిష‌న‌ర్‌లా కూడా ప‌నిచేస్తుంది.

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

Big Stories

Advertisement
×