BigTV English

Charmy Kaur – Puri Jagannath: ఛార్మీ – పూరీ మధ్య విభేదాలా.. ఇదెక్కడి ట్విస్ట్ మావా..?

Charmy Kaur – Puri Jagannath: ఛార్మీ – పూరీ మధ్య విభేదాలా.. ఇదెక్కడి ట్విస్ట్ మావా..?

Charmy Kaur – Puri Jagannath:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ (Puri Jagannath) ఎంతో మంది స్టార్ హీరోలకు మంచి కెరియర్ అందించి, ఇప్పుడు తన కెరియర్ కోసం ఆరాటపడుతున్నారు అని చెప్పవచ్చు. ఒకప్పుడు ఈయన దర్శకత్వంలో సినిమాలు చేసి స్టార్ స్టేటస్ ను అందుకున్న ఎంతోమంది హీరోలు.. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ కష్టాల్లో ఉంటే మేము మీకోసం సినిమా చేస్తాము అని వచ్చిన వాళ్ళు ఎవరూ లేరని పూరీ జగన్నాథ్ అభిమానులు కూడా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయినా సరే ఎవరి సహాయం లేకుండా తనను తాను మళ్లీ ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక అలాంటి ఈయన ప్రముఖ నటి ఛార్మీ కౌర్ (Charmy Kaur) తో కలిసి ‘పూరీ కనెక్ట్స్’ అనే నిర్మాణ సంస్థను స్థాపించి.. పలు చిత్రాలు నిర్మిస్తున్నారు. ముఖ్యంగా ఈ బ్యానర్ పై విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) తో ‘లైగర్’ సినిమా చేసి భారీ నష్టాన్ని చవి చూసిన విషయం తెలిసిందే.


భార్యను కాదని ఆమె ప్రేమలో పూరీ జగన్నాథ్..

ఇక పూరీ జగన్నాథ్ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. పూరీ జగన్నాథ్ లావణ్యను ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు. పిల్లలు పెద్దయి పెళ్లీడుకు వచ్చారు. అయినా సరే పూరీ జగన్నాథ్ తన భార్యను పక్కనపెట్టి మరీ హీరోయిన్ ఛార్మీ (Charmy Kaur) తో డేటింగ్ చేస్తున్నారు అనే వార్తలు చాలా రోజుల నుండి వినిపిస్తున్నాయి. అలాగే పూరీ జగన్నాథ్, లావణ్య మధ్య ఛార్మీ వల్లే గొడవలు వచ్చాయని , విడాకులు కూడా తీసుకోబోతున్నారనే రూమర్లు వినిపించాయి. కానీ ఇప్పటివరకు వాళ్లు విడాకులు తీసుకోలేదు. కానీ ఛార్మీ మాత్రం ప్రతిసారి పూరీ జగన్నాథ్ తో కలిసి కనిపిస్తూ.. వారిద్దరి మధ్య నిజంగానే ఎఫైర్ ఉందనే అనుమానాలు పుట్టిస్తోంది.


ఛార్మీతో గొడవపడ్డ పూరీ జగన్నాథ్..

వాస్తవానికి మొదట ఛార్మీ ను దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad) ను ప్రేమించింది. కానీ ఛార్మీ ఎప్పుడైతే పూరీ జగన్నాథ్ తో తిరగడం మొదలుపెట్టిందో అప్పటినుండి దేవిశ్రీప్రసాద్ ఈమెకు దూరమైనట్లు సమాచారం. అటు ఈమె వల్లే దేవి శ్రీ ప్రసాద్ కూడా పెళ్లి చేసుకోవడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇంతలా క్లోజ్ గా ఉన్న వీరిద్దరి మధ్య ఇప్పుడు సడన్ గా గొడవలు వచ్చాయని సమాచారం. అసలు విషయంలోకి వెళితే, పూరీ జగన్నాథ్ వరుస ఫ్లాప్ లతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక నాలుగు కథలను సిద్ధం చేసుకుని, స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి సిద్ధమయ్యారు. అయితే పూరీ జగన్నాథ్ సన్నిహితులు మాత్రం నువ్వు నీ నెక్స్ట్ సినిమా హిట్ కొట్టాలంటే అనవసరమైనవన్నీ వదిలి పెట్టాలని, డైరెక్షన్, కథ ,స్క్రిప్ట్ మీదే దృష్టి సారించాలని చెప్పారట. ఇక దీంతో పూరీజగన్నాథ్..ఛార్మీ తో గొడవపడ్డారని, నీవల్లే నాకు ఒక హిట్ కూడా దొరకడం లేదని, సినిమాలపై దృష్టి పెట్టడం లేదని గొడవలు పడి చివరికి ఇద్దరు బ్రేకప్ చెప్పుకుంటున్నట్లు సినీ సర్కిల్స్లో రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ విషయాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×