Honey Rose.. మళయాళ ముద్దుగుమ్మ హనీ రోజ్ (Honey Rose)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకప్పుడు తెలుగులో రెండు మూడు చిత్రాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ఈ మధ్యకాలంలో బాలకృష్ణ (Balakrishna)తో ‘వీరసింహారెడ్డి’ సినిమాలో మీనాక్షి క్యారెక్టర్ చేసి తన అందంతో, నటనతో అందరిని అబ్బురపరిచింది. ఇక ఈ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఈమెకు మాత్రం అవకాశాలు ఇవ్వలేదు. దీనికి తోడు అవకాశాలు రాకపోయినా పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కి వెళ్తూ భారీగానే పాపులారిటీని సంపాదించుకుంది. దీనికి తోడు క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బంది ఎదుర్కొన్నాను అంటూ వ్యాపారవేత్త బాబి చెమ్మనూరు పై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది . ఈ క్రమంలోనే అతడిని అరెస్టు చేయగా ఇటీవల మీద బయటకు వచ్చారు. అంతేకాదు ఈ విషయంలో కొంతమంది ఈమెకు మద్దతుగా నిలిస్తే, మరికొంతమంది ఆమెను తప్పుపడుతున్నారు.
Charmi – Puri Jagannath: ఛార్మీ – పూరీ మధ్య విభేదాలా.. ఇదెక్కడి ట్విస్ట్ మావా..?
ఇండస్ట్రీలో వారికి ఈమె ఒక చెత్త ఉదాహరణ – ఫరా
అలాంటి వారిలో ఫరా శిబిలా (Fara Shibla)కూడా ఒకరు. ఈమె పోరాటాన్ని ఒకపక్క మెచ్చుకుంటూనే.. మరోపక్క ఈమె తీరుపై విమర్శలు గుప్పించింది. నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె తాజాగా హనీ రోజ్ గురించి మాట్లాడుతూ.. “హనీ రోజ్ వేషధారణ గురించి నేను తప్పు పట్టడం లేదు. కానీ ఆమెను రకరకాల యాంగిల్స్ లో తీసిన ఫోటోలను, వీడియోలను ఆమె స్వయంగా షేర్ చేస్తోంది. దీని ద్వారా ఆమె ఏం చెప్పాలనుకుంటోంది అని మాత్రమే నేను ప్రశ్నిస్తున్నాను. నేను వేసుకునే దుస్తులు అవతలి వారికి అసౌకర్యంగా అనిపించకూడదు. దేనికైనా కొన్ని హద్దులు ఉంటాయి కదా.. ఇప్పుడు ఇంస్టాగ్రామ్ లో అందరూ కూడా తమ శరీరాలను చూపిస్తూ ఎగ్జిబిషన్ పెట్టేస్తున్నారు. మీరు కూడా ఫోటోలు చేశాను కదా అని ప్రశ్నిస్తారేమో.. ఏదైనా ఐడియా నచ్చితేనే, చూడడానికి బాగుంది అనిపిస్తేనే ఆయా ఫోటో షూట్ లు చేస్తాను. కానీ ఇప్పుడు జనాలు కేవలం లో దుస్తులతో కోల్డ్ కాఫీ తయారు చేస్తూ వీడియోలు కూడా చేస్తున్నారు. ఒకరకంగా చెప్పాలి అంటే హనీ రోజ్ అమాయకురాలైతే కాదు కదా.. ఆమె చాలా తెలివైనది. తను ఏం చేస్తుందో కూడా తనకు బాగా తెలుసు. కానీ ఇలా శరీరాన్ని చూపిస్తూ డబ్బు సంపాదించడం అనేది తప్పు అని నేను నా అభిప్రాయంగా చెప్పుకొన్నాను. ఇండస్ట్రీలో కష్టాలు ఎదుర్కొంటున్న ఎంతోమందికి ఈమె ఒక చెత్త ఉదాహరణగా నిలుస్తోంది” అంటూ మండిపడింది ఫరా.
ప్రతిభని నమ్ముకోవాలి కానీ శరీరాన్ని కాదు..
ఇదే విషయంపై ఫరా మాట్లాడుతూ..” మనపై మనకు నమ్మకం ఉండాలి.అప్పుడే ముందడుగు వేయాలి. ఎవరైనా సరే ప్రతిభను నమ్ముకోవాలి కానీ శరీరాన్ని కాదు. ఇక హనీ రోజ్ ఇప్పుడు శరీరాన్ని చూపిస్తూ డబ్బు సంపాదిస్తోంది అంటూ మండిపడింది. ఇకపోతే హనీ రోజ్ ఆలయం, ఈ వర్షం సాక్షిగా, వీరసంహారెడ్డి వంటి చిత్రాలలో నటించింది