E-Paper
Advertisement

Chiranjeevi : ఊటీలో మెగా ప్రాపర్టీని కొన్న చిరు… ధర ఎంతో తెలుసా?

Chiranjeevi : ఊటీలో మెగా ప్రాపర్టీని కొన్న చిరు… ధర ఎంతో తెలుసా?
Advertisement

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఇటీవల కాలంలో వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మ విభూషణ్ అవార్డు మొదలుకొని గిన్నిస్ బుక్, ఐఫా 2024 వంటి వేడుకల్లో ఆయన సెంటరాఫ్ ది అట్రాక్షన్ గా నిలిచారు. తాజాగా చిరు ఓ భారీ ప్రాపర్టీని కొన్నట్టుగా తెలుస్తోంది. అదికూడా ఆయన ఊటీలో కొనడంతో ఆ ప్రాపర్టీ వ్యాల్యూ ఎంత ఉంటుంది ? అనే విషయాన్ని అభిమానులు ఆరా తీస్తున్నారు. మరి ఈ ప్రాపర్టీ ప్రైజ్ ఎంత? అనే విషయాన్ని తెలుసుకుందాం పదండి.

ఊటీలో చిరు ఫామ్ హౌస్

Advertisement

మెగాస్టార్ చిరంజీవి ఊటీ లోని ఓ కొండపైన 6 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ రూమర్ల ప్రకారం ఇప్పటికే ఈ భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఇతర ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యాయి. ఇక ఈ ఆస్తినీ కొనుగోలు చేయడానికి చిరు రూ.16 కోట్లు ఖర్చుపెట్టినట్టుగా తెలుస్తోంది. ఆ ఏరియాలో చిరంజీవి ఒక అద్భుతమైన ఫామ్ హౌస్ ని నిర్మించే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. అంతేకాకుండా త్వరలోనే నిర్మాణాన్ని కూడా చేపట్టబోతున్నారట. చిరంజీవి తనయుడు రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన ఇప్పటికే సైట్ ను సందర్శించారని, ఆ ఫామ్ హౌస్ నిర్మాణానికి కావాల్సిన డిజైన్స్ ను సెలెక్ట్ చేశారని తెలుస్తోంది. ఈ ప్రశాంతమైన వాతావరణంలో చిరంజీవి నిర్మించబోయే ఫామ్ హౌస్ సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు సేద తీరే విడిది కాబోతోందని టాక్ నడుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి ఆస్తుల గురించి వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు. రీసెంట్ గా ఆయన బెంగళూరులో కొన్న ఒక ఫామ్ హౌస్ గురించి వార్తలు వినిపించాయి. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న దేవనహళ్లిలో చిరుకు ఇప్పటికే ఫామ్ హౌస్ ఉంది. మెగాస్టార్ తరచుగా పండగ సీజన్లో తన కుటుంబంతో కలిసి ఇక్కడే స్పెండ్ చేస్తాడని తెలుస్తోంది. ఇవి మాత్రమే కాకుండా మెగాస్టార్ చిరంజీవి దగ్గర భారీగానే ఆస్తులు ఉన్నాయి.

చిరంజీవి కార్ కలెక్షన్…

Advertisement

మెగాస్టార్ చిరంజీవికి హైదరాబాదులో ఒక ఇంద్ర భవనం లాంటి ఇల్లు ఉంది. వాటితో పాటు తెలంగాణ, ఆంధ్రాలో ఇతర ఆస్తులు కూడా భారీగానే ఉన్నాయి. ఇక చిరు కార్ కలెక్షన్ విషయానికి వస్తే ఆయన ఎప్పటికప్పుడు కొత్త కార్లను కొనుగోలు చేస్తుంటారు. ఇప్పటికే చిరంజీవి గ్యారేజ్ అత్యంత ఖరీదైన కార్లు ఉన్నాయి. చిరు దగ్గర రూ. 10 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ స్పెషల్ ఎడిషన్ కారుంది. అలాగే ఆయన గ్యారేజ్ లో 2 కోట్ల విలువైన రెండు టయోటా ల్యాండ్ క్రూయిజర్లు, కోటి విలువైన రేంజ్ రోవర్ వోగ్, కోటి విలువైన టయోటా వెల్ ఫైర్, 2.75 కోట్ల విలువైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. అంతేకాకుండా చిరు దగ్గర ప్రైవేట్ విమానం కూడా ఉండడం విశేషం. కాగా ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×