Chiranjeevi : “నువ్వు మాట్లాడిన మాటలు నా హృదయాల్ని తాకేలా ఉన్నాయి.. నీ మనసులో ఎంత ఆవేదన ఉందో అర్ధమవుతుంది..” అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. డాకూ మహరాజ్ సక్సెస్ మీట్ లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడిన మాటలపై స్పందిస్తూ చిరు ఈ ట్వీట్ చేశారు.
“డియర్ తమన్.. నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ వుండే నీలో ఇంత ఆవేదన వుండడం నాకు ఒకింత ఆశ్చర్యంగా కూడా అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అని అనిపించింది. విషయం సినిమా అయినా క్రికెట్ అయినా మరో సామజిక సమస్య అయినా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరు తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా వుంటుందని ఆలోచించాలి. ఎవరో అన్నట్టు మాటలు ఫ్రీ నే, Words can inspire. And Words can destroy. Choose what you wish to do. మనం పాజిటివ్ గా వుంటే ఆ ఎనర్జీ మన జీవితాలని కూడా అంతే పాజిటివ్ గా ముందుకు నడిపిస్తుంది…” – చిరంజీవి ట్వీట్
Dear @MusicThaman
నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ వుండే నీలో ఇంత ఆవేదన వుండడం నాకు ఒకింత ఆశ్చర్యంగా కూడా అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అని అనిపించింది.
విషయం సినిమా అయినా క్రికెట్ అయినా
మరో…— Chiranjeevi Konidela (@KChiruTweets) January 18, 2025
డాకు మహారాజ్ సక్సెస్ మీట్‌లో మాట్లాడిన మ్యూజిక్ డైెరెక్టర్ తమన్.. ఎమోషనల్ అయ్యారు. తమన్ మ్యూజిక్ అందించిన గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ చిత్రాలు ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యాయి. నెగెటివ్ ట్రెండ్, పనిగట్టుకుని చేసిన ట్రోలింగ్ వల్ల గేమ్ ఛేంజర్ సినిమా ఎలా నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుందో తెలిపారు. కేవలం నెగిటివ్ టాక్ తోనే సినిమాపై డిజాస్టర్ ముద్ర పడిందన్నారు.
“సోషల్ మీడియాలో నెగెటివిటీ ప్రభావం ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనే లేదు. వంద మంది కలిసి అది అబద్దం అని చెబితే.. నిజం కూడా అబద్దంలా మారే పరిస్థితి ఏర్పడింది. సోషల్ మీడియాలో జరిగే ఆర్గనైజ్డ్ ట్రెండ్, ట్రోలింగ్ తో సినిమాకు చాలా నష్టం జరిగింది. తాజాగా గేమ్ ఛేంజర్ మీద యాంటీ ఫ్యాన్స్ అంతా కలిసి పనీ పాటా లేనట్టుగా నెగెటివ్ ట్రెండ్ చేసేశారు. బెస్ట్ సినిమాను యావరేజ్ అని కూడా కాకుండా డిజాస్టర్ అని ముద్ర వేసేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో ఒక సక్సెస్ రావటం ఎంత ఇంపార్టెంట్.. ఆ సక్సెస్ వస్తే ఎలా ఉంటుంది.. ఆ సక్సెస్ వెనుక ఎంత మంది కష్టపడతారో చాలా మందికి తెలియదు నిజానికి ఓ నిర్మాత బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. అలాంటి నిర్మాత ఎంతో కష్టపడి ఓ సినిమాను తీస్తే.. ఇలాంటి నెగిటివ్ ట్రోల్స్ తో మనమే సినిమాను చంపేస్తున్నాం… అసలు ఇదేం బతుకు.. ”
“ప్రస్తుతం తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తుంది. పక్క భాషల నుంచి వచ్చి ఇక్కడ ఒక్క సినిమా అయినా చేయాలని ఎంతో మంది తహతహలాడుతున్నారు. అలా మన సినిమాల గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉంటే… ఇక్కడ ఫ్యాన్స్ మాత్రం నెగిటివ్ ట్రోల్స్ తో సినిమాను చంపేస్తున్నారు…” – మ్యూజిక్ డైరెక్టర్ తమన్
నిజానికి గేమ్ ఛేంజర్ మూవీ ఎంతటి నెగెటివిటీిని ఎదుర్కొందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కర్ణుడి చావుకి వంద కారణాలు అన్నట్టుగా.. ఆ సినిమా మీద ఇంతలా నెగిటివిటీ రావటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. బెస్ట్ కాన్సెప్ట్ తో వచ్చేసిన ఈ మూవీకి ఎదురైన నెగిటివ్ ట్రెండ్ తో దక్కాల్సిన గౌరవం దక్కకుండా పోయిందని సినీ ప్రముఖులు సైతం తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.