BigTV English

Chiranjeevi: యంగ్ బ్యూటీ శ్రీ లీలాకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి..!

Chiranjeevi: యంగ్ బ్యూటీ శ్రీ లీలాకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి..!

Chiranjeevi..మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తనతో కలిసి పనిచేసిన మహిళలకు అలాగే ఇతర మహిళలకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు యంగ్ బ్యూటీ శ్రీలీల (Sree Leela) కి కూడా మహిళా దినోత్సవం సందర్భంగా ఒక అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి, ఆమెను సర్ప్రైజ్ చేశారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. అయితే చిరంజీవి శ్రీలీలకు ఎలాంటి గిఫ్ట్ ఇచ్చారు..? అందులో ఏముంది? అనే విషయం ఇప్పుడు చూద్దాం.


శ్రీ లీలాకి ఊహించిన గిఫ్ట్ ఇచ్చిన చిరు..

అసలు విషయంలోకి వెళ్తే.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రముఖ డైరెక్టర్ వశిష్ట మల్లిడి (Vassista Mallidi) దర్శకత్వంలో చేస్తున్న చిత్రం ‘విశ్వంభర’. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్ లో శరవేగంగా జరుపుకుంటుంది. అదే స్టూడియోలో మరో సినిమా షూటింగ్లో ఉన్న శ్రీ లీలాకు ఈ విషయం తెలిసి తాను ఎంతగానో అభిమానించే చిరంజీవి తనకు సమీపంలోనే ఉన్నారని తెలుసుకొని, విశ్వంభర సెట్స్ కి వెళ్లి ఆయనను కలిసింది. ఇక మహిళా దినోత్సవం సందర్భంగా తనను కలిసిన శ్రీలీలకు శాలువా కప్పి సత్కరించిన చిరంజీవి, దుర్గాదేవి రూపం ముద్రించిన శంఖాన్ని ఆమెకు బహుమతిగా బహూకరించారు.


ఇన్స్టా ద్వారా తెలియజేసిన శ్రీ లీల..

ఇకపోతే చిరంజీవి తనకు ఇచ్చిన ఈ ప్రత్యేకమైన బహుమతిని అందుకున్న శ్రీ లీల..తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మొత్తానికి అయితే శ్రీ లీలాకు మహిళా దినోత్సవం సందర్భంగా అమ్మ వారి రూపం ముద్రించిన శంఖం బహుమతిగా అందడంతో ఇక అంతా శుభమే జరుగుతుంది అంటూ నెటిజన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు.

చిరంజీవి కెరియర్..

మెగాస్టార్ చిరంజీవి కెరియర్ విషయానికి వస్తే.. 7 పదుల వయసుకు చేరువలో ఉన్నా కూడా వరుస సినిమాలు ప్రకటిస్తూ మరింత బిజీగా మారిపోయారు. అందులో భాగంగానే ఇప్పుడు ‘బింబిసారా’ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న యంగ్ డైరెక్టర్ వశిష్ట మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. వాస్తవానికి అనిల్ రావిపూడి ఈ సంక్రాంతి సందర్భంగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాను విడుదల చేసి, మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక ఇప్పుడు అదే ఊపులో చిరంజీవి కూడా ఈయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా హడావిడి ముగిసిన తర్వాత తన సొంత ఊరిలో సొంత ఇంటి కలను నెరవేర్చుకున్న అనిల్ రావిపూడి ఇప్పుడు చిరంజీవి సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. అటు చిరంజీవి 90 రోజులపాటు అనిల్ రావిపూడికి డేట్ కేటాయించడం జరిగింది. మరి సంక్రాంతి సందర్భంగా.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాతో చిరంజీవి ఎలాంటి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటారో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×