పాన్, గుట్కా తినేవాళ్లు ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తూ పరిసరాలను అసహ్యంగా మార్చుతారు. చిన్ని చిన్న పట్టణాలు మొదలుకొని పెద్ద పెద్ద నగరాల వరకు గుట్కా మరకలు కామన్ గా కనిపిస్తాయి. రైల్వే స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు, సినిమా హాళ్లతో పాటు బహిరంగ ప్రదేశాల్లోనూ గుట్కా మరకలు దర్శనం ఇస్తుంటాయి. తాజాగా ముంబైలోని ఓ రైల్వే స్టేషన్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పాన్ మసాలాలు తినే వాళ్లు రైల్వే స్టేషన్లను ఎంత దారుణంగా తయారు చేస్తారో ఈ ఫోటోలను చూస్తే అర్థం అవుతోంది.
అసహ్యం కలిగించేలా గుట్కా మరకలు
ముంబైలోని పలు రైల్వే స్టేషన్లలోనూ గుట్కా మరకలు సాధారణంగా కనిపిస్తుంటాయి. మరికొన్ని స్టేషన్లలు మరింత దారుణంగా ఉంటాయి. పాన్, గుట్కా ఉమ్మివేయడం వల్ల రైల్వే స్టేషన్ గోడలు, రైల్వే ట్రాక్, రైల్వే స్టేషన్ పైకప్పు అంతా రెడ్ కలర్ వేసినట్లుగా మారిపోయింది. ఈ ఫోటోలు చూస్తేనే సాధారణ ప్రయాణీకులకు వాంతులు కలిగే అవకాశం ఉంటుంది.
బోరివాలి రైల్వే స్టేషన్ గా భావిస్తున్న నెటిజన్లు
గత ఏడాది ఏప్రిల్ లో ముంబై బోరివాలి రైల్వే స్టేషన్ కు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎస్కలేటర్ పక్క గోడలు గుట్కా మరకలతో దారుణంగా మారిపోయాయి. రైల్వే స్టేషన్ ఆవరణలోనూ గుట్కా మరకలు కామన్ అయ్యాయి. ఈ దారుణ పరిస్థితిని వివరిస్తూ @mumbaimatterz అనే యూజర్ పోస్ట్ రైల్వే మినిస్ట్రీతో పాటు వెస్ట్రన్ రైల్వే అధికారులకు ట్యాగ్ చేశారు. అయినప్పటికీ పెద్దగా స్పందన లభించలేదు.
తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నెటిజన్లు
రైల్వే స్టేషన్ లో ఇంత దారుణంగా గుట్కా ఉమ్మివేయడం పట్ల నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు పట్టించుకోకపోవడం వల్లే రైల్వే స్టేషన్లు ఇలా మారిపోతున్నాయి అంటూ మండిపడ్డారు. ప్రయాణీకులు సైతం అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు అనడానికి ఇదో ఉదాహారణ అంటూ మండిపడ్డుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేస్తే శిక్షించడానికి చట్టాలు ఉన్నాయి. ప్రశ్నించే అధికారులు ఉన్నారు. కానీ, అసలు మనం ఎందుకు ఉమ్మివేయాలి? అని ఆలోచించాలి. ఇలా ఉమ్మివేయడం ద్వారా మన పిల్లలకు సమాజానికి ఎలాంటి మెసేజ్ అందిస్తున్నామంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇప్పటికైనా రైల్వే స్టేషన్లను అపరిశుభ్రంగా మార్చే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలంటున్నారు.
?igsh=MWRwM3dsZGxmZ2t3NQ%3D%3D
Read Also: రన్నింగ్ ట్రైన్ లో నుంచి కింద పడబోయిన మహిళ.. కాపాడిన రైల్వే పోలీస్!
కఠినంగా వ్యవహరిస్తున్న ముంబై మున్సిపల్ అధికారులు
అటు ముంబై మున్సిపల్ అధికారులు బహిరంగ ప్రదేశాల్లో గుట్కాలు తిని ఉమ్మేవారి విషయంలో సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వారికి పెద్ద మొత్తంలో జరిమానా విధిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పరిశుభ్రత పాటించాలంటూ పౌరులకు ముంబై మున్సిపల్ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మనం పరిశుభ్రత పాటిస్తే రేపటి సమాజం మనల్ని చూసి నేర్చుకుంటుందని వెల్లడిస్తున్నారు.
Read Also: రంగు రాసి ముద్దు పెట్టబోయిన ప్రియుడు.. రెప్పపాటులో దవడ పగుల్స్!