BigTV English

North Korea : తొలి అణు జలాంతర్గామిని పరిచయం చేసిన కిమ్ – దక్షిణ కొరియా, అమెరికాలు షాక్

North Korea : తొలి అణు జలాంతర్గామిని పరిచయం చేసిన కిమ్ – దక్షిణ కొరియా, అమెరికాలు షాక్

North Korea : నిత్యం అణు ప్రయోగాలతో ప్రపంచాన్ని కలవరపెట్టే ఉత్తర కొరియా మరో సంచలనాత్మక విషయాన్ని వెల్లడించింది. అంతర్జాతీయంగా ఎన్నో ఆంక్షలు అమలవుతున్నా.. వాటిని అధిగమించి తన తొలి అణు జలాంతర్గామిని ప్రపంచానికి చూపించింది. ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్.. దేశంలోని ప్రధాన షిప్‌యార్డ్‌లను సందర్శించిన సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. ఆ దేశ అధికారిక మీడియా ఫోటోలను విడుదల చేసింది. దీనిని అణుశక్తితో నడిచే వ్యూహాత్మక గైడెడ్ క్షిపణి జలాంతర్గామిగా పేర్కొంది. ఈ జలాంతర్గామి అభివృద్ధి ఉత్తర కొరియా నావికా సామర్థ్యాలలో ప్రధాన మైలురాయిని సూచిస్తుందని, ఇది అణ్యాయుధ నిరోధకాన్ని అందిస్తుందని వెల్లడించింది. అయితే.. అణుశక్తితో నడిచే జలాంతర్గామిని తయారు చేయడంలోని సాంకేతిక సవాళ్లను అధిగమించడంలో ఉత్తర కొరియాకు మిత్రదేశమైన రష్యా సహాయం చేసి ఉండొచ్చు అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


షిప్‌యార్డులో కిమ్ జోంగ్ ఉన్

యుద్ధనౌకలు నిర్మిస్తున్న ప్రధాన షిప్‌యార్డులను నార్త్ కొరియా అగ్రనేత కిమ్ జోంగ్ ఉన్ సందర్శించారు. ఈ విషయాన్ని కొరియా జాతీయ మీడియానే విడుదల చేసింది. కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (KCNA) అని తెలిపింది. అయితే.. దీని సామర్థ్యాల గురించి కానీ, మరే విషయాలపై కానీ నిర్దిష్ట వివరాలను వెల్లడించలేదు. ఈ జలాంతర్గామి 6,000 నుంచి 7,000 టన్నుల తరగతి నౌక కావచ్చని, దాదాపు 10 క్షిపణులను మోసుకెళ్లే అవకాశం ఉందని ఫోటోలను పరిశీలించిన నిపుణులు అంచనా వేస్తున్నారు. “వ్యూహాత్మక గైడెడ్ క్షిపణులు” అనే పదం అంటే అది అణ్వాయుధ సామర్థ్యం గల ఆయుధాలకు కలిగి ఉంటుందని దక్షిణ కొరియా జలాంతర్గామి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ వార్త ప్రపంచానికి తెలిసినప్పటి నుంచి దక్షిణ కొరియాతో పాటుగా అమెరికా అధికారులు.. వారి ముప్పు గురించి ఆందోళనలు లేవనెత్తుతున్నారు.


ఉత్తర కొరియా సైనిక లక్ష్యాలు

2021లో ప్రకటించిన సైనిక విస్తరణ ప్రణాళికలో భాగంగా అణు జలాంతర్గాములతో సహా అధునాతన ఆయుధాలను అభివృద్ధి చేస్తామని కిమ్ గతంలోనే ప్రతిజ్ఞ చేశారు. హైపర్‌సోనిక్ ఆయుధాలు, ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు, గూఢచారి ఉపగ్రహాలు, బహుళ-వార్‌హెడ్ క్షిపణులు.. కిమ్ లక్ష్యాల్లో ఉన్నాయి. ఈ ప్రకటన వెలువడినప్పటి నుంచి ఉత్తర కొరియా బహుళ ఆయుధ పరీక్షలను నిర్వహిస్తూనే ఉంది. నీటి అడుగున నుంచి క్షిపణులను ప్రయోగించే సామర్థ్యం.. నార్త్ కొరియా సంతరించుకోవడంతో ఈ ఆందోళనలు మరింత పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఈ దాడుల్ని గుర్తించడం చాలా కష్టతరమైన పని. అయితే.. ఉత్తర కొరియాపై భారీ ఆంక్షలు ఉన్నా, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఉత్తర కొరియా.. అణుశక్తితో నడిచే జలాంతర్గామిని నిర్మించడానికి అవసరమైన సాంకేతికత, వనరులను ఎలా పొందిందనే దానిపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

Also Read : Romance Scam In China : అమ్మాయిని చూసి చొంగ కార్చారు.. పాపం, ప్లాట్లు కొనేసి పాట్లు పడుతున్నారు

ఉత్తర కొరియాకు సాంప్రదాయ ఆయుధాలను సరఫరా చేయడానికి బదులుగా “రష్యన్ సాంకేతిక సహాయం” లభించి ఉండవచ్చని దక్షిణ కొరియా నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే.. ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధానికి మద్దతుగా దళాలను సైతం పంపించడంతో వీరి మధ్య బలం మరింత పెరిగిందని అంచనా వేస్తున్నారు. ఈ జలాంతర్గామిని ఒకటి, రెండు ఏళ్ల లోపు ప్రయోగాలు పూర్తి చేసి.. ఆ తర్వాత క్రియాశీలకంగా సేవల్లోకి తీసుకురావచ్చని, అందుకోసం ముందుగానే దాని సామర్థ్యాలను పరీక్షించుకోవచ్చని అంటున్నారు. ఉత్తర కొరియా దగ్గర ప్రస్తుతం 70 నుండి 90 జలాంతర్గాములు ఉన్నాయని అంచనా.. కానీ చాలా వరకు అవి పాతవి కావడంతో.. అవి టార్పెడోలు, మైన్‌లను మాత్రమే ప్రయోగించగలవని, అత్యాధునిక క్షిపణులను ప్రయోగించేందుకు పనికి రావని అంటున్నారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×