Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. ఇది పేరు కాదు ఒక బ్రాండ్. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు. దేశ విదేశాల్లో కూడా ఆయన పేరు తెలియనివారుండరు. స్వయంకృషితో పైకి వచ్చేవారికి ఆయనే ఇన్స్పిరేషన్. సినిమాల విషయం పక్కన పెడితే.. సహాయం అన్నవారికి ముందుండి సాయం చేసేవారిలో చిరు మొదటివాడు. ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం పద్మవిభూషణ్ ఇచ్చి గౌరవించింది. ఇక ఈ మధ్యకాలంలో చిరు.. ఎక్కువ వివాదాలతో ఫేమస్ అవుతున్నాడు.
సాధారణంగా ఒక ఈవెంట్ కు చిరు వస్తున్నాడు అంటే.. ఎంత పని ఉన్నవారు అయినా చిరు ఏం మాట్లాడుతున్నాడో అని వినడానికి ఆసక్తి చూపిస్తారు. ఇక చిన్న సినిమాల కోసం మెగాస్టార్ వచ్చాడు అంటే ఆ సినిమాలో విషయం ఉండి ఉంటుంది అనే అంచనాకు ప్రేక్షకుడు వచ్చేస్తాడు. అయితే ఈ మధ్యకాలంలో ఒక ఈవెంట్ కు వస్తున్న స్టార్స్ సినిమా గురించి మాట్లాడడం మానేసి తమ వ్యక్తిగత విషయాలను కానీ, లేక విమర్శలు చేసి వెళ్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ మధ్య స్టేజిపై స్టార్స్ బూతులు మాట్లాడడం ఫ్యాషన్ గా మారింది.
తాజాగా మెగాస్టార్ చిరు నోటి నుంచి కూడా బూతులు వచ్చాయని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. అంత బూతు మాట ఆయన ఏమన్నాడు.. ? అసలు ఏ ఈవెంట్ లో చిరు నోరు జారాడు.. ? అనేది తెలుసుకుందాం. చిరు- బ్రహ్మానందం కాంబో గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజం చెప్పాలంటే చిరు సినిమాతోనే బ్రహ్మీ కెరీర్ మొదలయ్యింది. ఇక ప్రస్తుతం చాలా సెలక్టీవ్ గా సినిమాలు చేస్తున్న బ్రహ్మీ.. ఈసారి తన కొడుకు గౌతమ్ ను హీరోగా నిలబెట్టడానికి రంగంలోకి దిగాడు.
VD 12 Teaser: ఎన్టీఆర్ వాయిస్ తో రౌడీ హీరో సినిమా టీజర్.. కొత్తగా ట్రై చేస్తున్న విజయ్ దేవరకొండ..!
ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వంలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన చిత్రమే బ్రహ్మా ఆనందం. రాజా గౌతమ్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. గతరాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా విచ్చేశాడు.
బ్రహ్మ ఆనందం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరు ఎన్నో వివాదాలకు తెరలేపాడు. అవన్నీ పక్కన పెడితే ఆయన నోటినుంచి బూతు రావడం మరింత సెన్సేషన్ సృష్టిస్తోంది. బ్రహ్మీ గురించి చెప్పడానికి చిరు మీమ్స్ లో ఆయనకున్న ఫాలోయింగ్ ను ఉదాహరణగా చెప్పుకోచ్చాడు. ” సరిగా ఇప్పుడు మీమ్స్ లో మొహం పెడతారు కదా.. ఎర్రి** మొహం పెడతారు కదా.. రెడ్ ఫేస్. ఆ రెడ్ ఫేస్ ఆయనకు ఫిక్స్ అయ్యిపోయింది. ఆ ఫ్లైట్ ఎక్కడం, ఎయిర్ హోస్టెస్ ను చూడడం” అంటూ చెప్పుకొచ్చాడు.
అయితే అందులో చిరు బూతు మాట్లాడాడని కొంతమంది ట్రోలర్స్ ట్రోల్ చేస్తున్నారు. అయితే ఆయన అన్నది ఎర్రి** మొహం కాదు అని ఎరుపు మొహం అని.. గ్యాప్ ఇవ్వకుండా చెప్పడంతో అది బూతు కింద వినపడతుందని కొందరు అంటుంటే.. ఇంకొందరు.. స్టేజిపై ఆ బూతులు ఏంటి చిరు.. ఛీఛీ.. మరి ఇంతలా.. మాట్లాడతావు అనుకోలేదు అని ఇంకొందరు అంటున్నారు. ఏదిఏమైనా చిరు తన పెద్దరికాన్ని కాపాడుకొనేలా మాట్లాడాలని అందరూ సలహాలు ఇస్తున్నారు. మరి చిరు ముందు ముందు ఇలా మాట్లాడం మానేస్తాడా.. ? లేదా.. ? అనేది చూడాలి.