VD 12 Teaser: విజయ్ దేవరకొండ (Vijay deverakonda).. చివరిగా ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా చేసి డిజాస్టర్ మూటగట్టుకున్న విజయ్ దేవరకొండ. ఇప్పుడు కింగ్ డమ్ (Kingdom) అనే ఒక శక్తివంతమైన టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి (Gautam thinnanuri) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ ను ఆవిష్కరించారు మేకర్స్. ఇందులో అదిరిపోయే యాక్షన్స్ సన్నివేశాలు, కట్టిపడేసే భావోద్వేగాలతో, థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించే యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోందని మనకు టీజర్ తో స్పష్టం చేశారు. ఈ ఇంటెన్స్ టీజర్ తో సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి..
అదిరిపోయే వాయిస్ ఓవర్ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్..
విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇక పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమా తెలుగు వెర్షన్ కి జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR), తమిళ్ వెర్షన్ కి సూర్య (Suriya), హిందీ వర్షన్ కి రణబీర్ కపూర్ (Ranbir Kapoor) వాయిస్ ఓవర్ అందించారు. ఈ ముగ్గురు స్టార్లు తమ గొంతుతో రోమాలు నిక్కబడుచుకునేలా వాయిస్ ఓవర్ అందించి, టీజర్ ను మరో స్థాయికి తీసుకెళ్లారు. మొత్తానికైతే ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ ప్రాణం పెట్టి మరీ పనిచేస్తున్నాడని మనకు టీజర్ ద్వారా అర్థమవుతోంది. ముఖ్యంగా సినిమాను ఇంకో స్థాయికి తీసుకెళ్లడానికి నూటికి నూరు శాతం కృషి చేస్తున్నారు. టీజర్ తోనే సినిమా పై భారీ అంచనాలు పెంచేసిన విజయ్ దేవరకొండ ట్రైలర్తో మరే విధంగా ఆకట్టుకుంటారో చూడాలి.
సరికొత్తగా ఆకట్టుకున్న రౌడీ హీరో..
2025 మే 31 తేదీన ప్రపంచ వ్యాప్తంగా.. భారీ స్థాయిలో కింగ్ డమ్ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. విడుదల తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనాలు సృష్టించి ఘనవిజయం అందుకుంటుందని నిర్మాతలు కూడా నమ్మకంగా ఉన్నారు. ముఖ్యంగా ఈ వేసవికి విజయ్ అభిమానులకు అతిపెద్ద పండుగ రాబోతోందని కూడా చెప్పవచ్చు.ఎన్టీఆర్ వాయిస్ ,అనిరుద్ మ్యూజిక్ రెండు కూడా టీజర్ కు మరింత హైలెట్ గా నిలిచాయి. ఇది చూసిన కొంతమంది నెటిజెన్స్ గజిని పోలికలతో విజయ్ దేవరకొండ కనిపించాడని, అది కూడా మిలిటరీ నేపథ్యంలో . జైలు ఎపిసోడ్, పోలీస్ ఎపిసోడ్ ,చివర్లో గజినీ సినిమా తలపించేలాగా అనిపించిందని కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ టీజర్ పై ఎవరు ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినా.. అభిమానులకు మాత్రం మంచి ఫీస్ట్ ఇస్తోందని చెప్పవచ్చు.
రౌడీ హీరో సరసన నేషనల్ క్రష్..
ఇక విజయ్ దేవరకొండ విషయానికి వస్తే.. సరైన సక్సెస్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోబోతున్నారని అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఇందులో యంగ్ బ్యూటీ శ్రీ లీల (Sreeleela), నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika mandanna) హీరోయిన్లుగా కనిపించబోతున్నారు.