South Central Railway Trains Cancele: ఏపీ ప్రయాణీకులకు సౌత్ సెంట్రల్ రైల్వే కీలక కీలక సూచన చేసింది. ముఖ్యంగా తెనాలి జంక్షన్ మీదుగా రాకపోకలు కొనసాగించే వారిని అలర్ట్ చేసింది. తెనాలి జంక్షన్ యార్డులో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను క్యాన్సిల్ చేస్తున్నట్లు ప్రకటించింది. మరికొన్ని రైళ్లకు సంబంధించి సమయాల్లో మార్పులు చేసింది. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటన జారీ చేసింది. తెనాలి మీదుగా రాకపోకలు కొనసాగించే ప్రయాణీకులు ఈ విషయాన్ని గమనించాలని కోరింది.
గూడూరు-కృష్ణా కెనాల్ జంక్షన్ మూడో లైన్ నిర్మాణం
తెనాలి జంక్షన్ మీదుగా వెళ్లే గూడూరు-కృష్ణా కెనాల్ జంక్షన్ మూడో లైన్ నిర్మాణ పనులు జరుగుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో తెనాలి రోడ్ నంబర్ 2ను ఇవాళ్టి నుంచి సుమారు నెల రోజుల పాటు క్లోజ్ చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ పనుల కారణంగా ఆ మార్గంలో నడిచే మూడు రైళ్లను నెల రోజుల పాటు (ఫిబ్రవరి 12 నుంచి మార్చి 13 వరకు) క్యాన్సిల్ చేస్తున్నట్లు ప్రకటించారు.
క్యాన్సిల్ అయిన రైళ్ల వివరాలు..
రైల్వే అధికారులు క్యాన్సిల్ చేసిన రైళ్ల వివరాలు ఇవే.
⦿ విజయవాడ-తెనాలి( 67221) రైలును ఫిబ్రవరి 12 నుంచి మార్చి 13 వరకు నెల రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
⦿ తెనాలి-రేపల్లె(67231) రైలును ఫిబ్రవరి 12 నుంచి మార్చి 13 వరకు నెల రోజుల పాటు క్యాన్సిల్ చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది.
⦿ రేపల్లె-తెనాలి (67332) రైలును సైతం ఫిబ్రవరి 12 నుంచి మార్చి 13 వరకు నెల రోజుల పాటు ఈ రైలును రద్దు చేసినట్లు అధికారలు వెల్లడించారు.
ఆలస్యంగా నడిచే రైళ్ల వివరాలు
⦿ తెనాలి-రేపల్లె మధ్య నడిచే మరో రైలు (67224)ను నెల రోజుల పాటు సుమారు గంట పాటు ఆలస్యంగా నడపనున్నట్లు రైల్వే అధికారులు అధికారులు ప్రకటించారు.
ఆ రూట్ లో 11 రోజుల పాటు 36 రైళ్లు రద్దు!
ఖమ్మం రైల్వే స్టేషన్ పరిధిలో నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా 30 రైళ్లను క్యాన్సిల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఆయా రైళ్లను వేర్వేరు రోజుల్లో రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. కాజీపేట- డోర్నకల్, డోర్నకల్- విజయవాడ, భద్రాచలం రోడ్డు- విజయవాడ ప్యాసింజర్ రైళ్లను 11 రోజుల పాటు రాకపోకలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని సిర్పూరు కాగజ్‌నగర్, రెబ్బెన, బెల్లంపల్లి, మంచిర్యాల రైల్వే స్టేషన్ల గుండా వివిధ ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లు క్యాన్సిల్ చేశారు. ఫిబ్రవరి 10 నుంచి 20 వరకు ఈ మార్గంలోని నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అటు గోల్కొండ, భాగ్యనగర్, శాతవాహన సహా పలు ఎక్స్ ప్రెస్ రైళ్లు వారం నుంచి 11 రోజుల పాటు ప్రయాణీకులకు అందుబాటులో ఉండవని ప్రకటించింది. మరో 9 రైళ్లను దారి మళ్లించినట్లు వెల్లడించింది. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడవనున్నట్లు తెలిపింది.
Read Also: ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలు, ఎన్ని కిలో మీటర్లు ఉంటుందో తెలుసా?