BigTV English

chiru vs venky :చిరును భయపెట్టిన వెంకీ.. ఓటీటీకి దూరం అంటున్న మెగాస్టార్

chiru vs venky :చిరును భయపెట్టిన వెంకీ.. ఓటీటీకి దూరం అంటున్న మెగాస్టార్
chiru vs venky

chiru vs venky : ఓటీటీ ఆఫర్ వస్తే చేయడానికి తాను రెడీ అంటూ ఓసారి అనౌన్స్ చేశాడు మెగాస్టార్ చిరంజీవి. తీరా అవకాశం వెతుక్కుంటూ వస్తే మాత్రం కాదంటున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ ఇదే. చిరంజీవి గనక ఒప్పుకోవాలి… భారీ రెమ్యునరేషన్ ఇచ్చేందుకు కూడా సిద్ధం. కాని, ఆ ధైర్యం చేయలేకపోతున్నాడు మెగాస్టార్. అందుకు కారణం విక్టరీ వెంకటేష్ అంటున్నారు.


వెంకీ ఈమధ్య రానా నాయుడు సిరీస్‌తో ఓటీటీలోకి వచ్చాడు. నిజానికి వెంకీ గట్స్‌కు మెచ్చుకోవాలి. ఓటీటీ అంటేనే.. అలాంటి కంటెంట్ ఉంటుంది. ఇప్పటికీ ఫ్యామిలీ మెన్ అనే ముద్ర వేసుకుంటే.. థియేటర్లకు వచ్చే యూత్ ఎంత మంది. అందుకే, తనపై ఉన్న ఫ్యామిలీ మెన్ అనే మార్క్ చెరిపేయదలచుకున్నాడు. ఇది అర్ధం చేసుకోలేక పాపం వెంకీని ఆడిపోసుకున్నారు. ఏదైతేనేం.. రానా నాయుడు హిట్. అందులో బోల్డ్ కంటెంట్ ఉందట, వెంకీ అలా నటించాడట అని టాక్ వచ్చే సరికి అసలు అందులో ఏముందో చూద్దాం అని చూశారు. ఇక నార్త్‌లోనూ సూపర్ హిట్. కారణం ఏదైతేనేం.. తెలుగు వర్షన్‌లోనూ బాగానే చూశారు జనం. అందుకే, నెక్ట్స్ సీజన్ ప్లాన్ చేస్తున్నారు.

ఓవైపు విక్టరీ వెంకటేశ్ ఇలా దూసుకెళ్తుంటే.. వెంకీని అడ్డుపెట్టి ఓటీటీ ఆఫర్‌ను చిరు వదులుకున్నాడని మాట్లాడుకుంటున్నారు. నిజానికి ఓటీటీ కంటెంట్ అంటేనే.. కాస్తో కూస్తో బూతులు మాట్లాడాలి, బూతు సీన్లలో నటించాలి.. ప్రొడ్యూసర్, డైరెక్టర్ చెప్పే లైన్‌లో వెళ్లాలి. అవి లేకుండా కూడా వెబ్ సిరీస్ తీయొచ్చు.. బట్, ప్రేక్షకుల నుంచి యాక్సెప్టెన్స్ ఉండకపోవచ్చు. బోల్డ్ కంటెంట్ ఉంటే… బంపర్ హిట్టే. ముఖ్యంగా అన్ని భాషల్లో రిలీజ్ అవుతుంది కాబట్టి… ఆ మాత్రం మాస్ మసాలా కోరుకుంటారు ప్రొడ్యూసర్లు. కాని, చిరంజీవి అందుకు ఒప్పుకోవడం లేదట. వెంకీకి వచ్చిన పేరు, విమర్శలు చూసి… అందుకు సిద్ధంగా లేనని చెప్పినట్టు చెబుతున్నారు. ఇప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్‌ను పోగొట్టుకునేందుకు రెడీగా లేనని తెగేసి చెబుతున్నాడు మెగాస్టార్. ఒకవేళ బూతు కంటెంట్ లేకుండా… మంచి యాక్షన్ సిరీస్ ఉంటే గనక మెగాస్టార్ ఓటీటీకి ఓకే చెప్పొచ్చని అంటున్నారు. చూడాలి మరి.. చిరంజీవిన సాటిస్‌ఫై చేసేలా ఎవరొస్తారో. 


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×