BigTV English

 All Rounders : ఆల్‌రౌండర్లుగా సక్సెస్.. జట్టును గెలిపించడంలోనే ఫెయిల్.. ఎవరా ముగ్గురు?

 All Rounders : ఆల్‌రౌండర్లుగా సక్సెస్.. జట్టును గెలిపించడంలోనే ఫెయిల్.. ఎవరా ముగ్గురు?
All Rounders

All Rounders : ఏ ఫార్మాట్‌లో అయినా సరే ఆల్ రౌండర్లు చాలా ఇంపార్టెంట్. మరీ ముఖ్యంగా టీ20 మ్యాచ్‌లలో చాలా కీ రోల్ ప్లే చేస్తారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరపున ఆడుతున్న మిచెల్ మార్ష్.. అద్భుతమైన ఆల్ రౌండర్. ఏప్రిల్ 29న హైదరాబాద్‌తో జరిగిన మ్యాచులో ఈ ఆసిస్ ఆల్ రౌండర్ అటు బాల్, ఇటు బ్యాట్‌తో రాణించాడు. నాలుగు ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అందులో ఒక మెయిడెన్ ఓవర్ కూడా. రాహుల్ త్రిపాఠి, మార్కమ్, బ్రూక్, సమద్‌ను ఔట్ చేశాడు. ఇక బ్యాటింగ్‌లోనూ అదరగొట్టాడు. ఫిలిప్ సాల్ట్‌తో కలిసి రెండో వికెట్‌కు 112 పరుగులు జోడించాడు. కాని, ఎంత కష్టపడినా.. మ్యాచ్ మాత్రం గెలవలేకపోయారు. ఇలా ఆల్ రౌండర్లుగా అద్భుతంగా ఆడినప్పటికీ.. మ్యాచ్‌ను గెలిపించలేకపోయిన సందర్భాలు ఆటగాళ్లకు చేదు జ్ఞాపకాలు అందించాయి.


1. మొయిన్ అలీ, 2019 ఐపీఎల్
ఆర్సీబీ తరపున 2019 సీజన్‌లో ఆడిన మొయిన్ అలీ… ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్ రౌండర్‌గా అద్భుతంగా రాణించాడు. 32 బాల్స్‌లో 50 పరుగులు చేయడం వల్లే ఆర్సీబీ 171 పరుగులు చేయగలిగింది. లక్ష్య ఛేదనకు దిగన ముంబై ఇండియన్స్‌ను ఆదిలోనే దెబ్బతీశాడు. ఆ మ్యాచ్‌లో ఓపెనర్లు రోహిత్ శర్మ, డికాక్‌ను మొయిన్ అలీ ఔట్ చేశాడు. నాలుగు ఓవర్లు వేసి 18 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అయినా సరే ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడిపోయింది.

2. క్రిస్ మోరిస్, 2016
2016 సీజన్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున ఆడిన సౌతాఫ్రికన్ ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్… గుజరాత్ లయన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సూపర్ పర్ఫామెన్స్ చూపించాడు. ఆ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసి మంచి ఊపులో ఉన్న మెక్‌కలమ్, సురేష్ రైనాను ఔట్ చేశాడు. మొత్తంగా 35 పరుగులు ఇచ్చాడు. ఆ తరువాత ఛేజింగ్‌లో భాగంగా బ్యాటింగ్‌కు దిగిన మోరిస్.. 32 బంతుల్లో ఏకంగా 82 పరుగులు చేశాడు. 8 సిక్సులు, 4 ఫోర్లతో గుజరాత్ బౌలర్లను వణికించాడు. కాని, ఆ మ్యాచ్‌లో గుజరాతే గెలిచింది.


3. హర్భజన్ సింగ్, 2015
స్పిన్ బౌలింగ్‌లో మెరుపులు మెరిపించే హర్భజన్ సింగ్ ఆల్ రౌండర్ పర్ఫామెన్స్ చూపించాడు. 2015 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరపున ఆడిన హర్భజన్.. పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో బాల్, బ్యాట్‌తో అదరగొట్టాడు. ఆ మ్యాచ్‌లో ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్, మురళి విజయ్ వికెట్లు పడగొట్టాడు. నాలుగు ఓవర్లలో కలిపి 20 పరుగులే ఇచ్చాడు. ఆ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు 177 పరుగులు చేసింది. ఛేజింగ్‌లో భాగంగా 8వ పొజిషన్‌లో బ్యాటింగ్‌కు దిగిన భజ్జీ.. 24 బాల్స్‌లోనే 64 పరుగులు చేశాడు. కాని, ఆ మ్యాచ్‌లో ముంబై ఓడిపోయింది. 

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×