E-Paper
Advertisement

Chitra Shukla: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్… పెళ్లి ముహూర్తానికే గుడ్ న్యూస్

Chitra Shukla: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్… పెళ్లి ముహూర్తానికే గుడ్ న్యూస్
Advertisement

Chitra Shukla : టాలీవుడ్ స్టార్స్ చాలామంది ఇటీవల కాలంలో తల్లిదండ్రులయిన విషయం తెలిసిందే. నిన్న మొన్నటిదాకా వరుసగా టాలీవుడ్ లో పెళ్లి బాజాలు మోగగా, ఇప్పుడేమో వరుసగా పేరెంట్స్ అవుతూ వార్తల్లో నిలుస్తున్నారు పలువురు సెలబ్రిటీ కపుల్స్. తాజాగా తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ చిత్ర శుక్లా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అది కూడా కరెక్ట్ గా తన పెళ్లి ముహూర్తానికి గుడ్ న్యూస్ అందింది అంటూ సోషల్ మీడియా వేదికగా ఈ శుభవార్తను అభిమానులతో పంచుకుంది.

మగ బిడ్డకు జన్మనిచ్చిన చిత్ర శుక్లా

Advertisement

హీరోయిన్ చిత్రా శుక్లా సోషల్ మీడియా వేదికగా తను పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది అన్న విషయాన్ని పోస్ట్ చేసింది. నాలుగు రోజుల క్రితమే అంటే సెప్టెంబర్ 30న రాత్రి 9:31 తనకు బిడ్డ పుట్టాడని వెల్లడించిన బ్యూటీ, ఇదే ముహూర్తానికి తమకు పెళ్లి జరిగిందని, ఇప్పుడు అదే ముహూర్తానికి బాబు పుట్టడంతో ఆ టైమ్ అనేది తనకు మరింత స్పెషల్ గా మారింది అంటూ ఇంస్టాగ్రామ్ లో తన న్యూ బార్న్ బేబీ ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలో అప్పుడే పుట్టిన చిత్రా శుక్లా వారసుడు చూడడానికి క్యూట్ గా ఉన్నాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ బ్యూటీ 2023 డిసెంబర్ లో వైభవ్ ఉపాధ్యాయ అనే పోలీసు అధికారిని పెళ్లాడింది. ఇప్పుడు మగ బిడ్డని ప్రసవించి, ఆ ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటూ కొడుకు ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో అభిమానులు ఈ సెలబ్రిటీ కపుల్ పేరెంట్స్ గా మారినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా చిత్రా శుక్లా ఇండోర్ కు చెందిన అమ్మాయి. 2014 నుంచి ఈ బ్యూటీ సినిమాలు చేస్తూ వస్తోంది. బ్యాగ్రౌండ్ డాన్సర్ గా కెరీర్ ని మొదలు పెట్టిన ఈ హీరోయిన్ 2017లో రిలీజ్ అయిన ‘మా అబ్బాయి’ అనే తెలుగు సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయమైంది. పెద్దగా పాపులర్ కాకపోయినా చాలా వరకు సినిమాలలో నటించింది. తెల్లవారితే గురువారం, సిల్లీ ఫెలో, రంగుల రాట్నం, హంట్, పక్కా కమర్షియల్, ఉనికి, మస్తు షేడ్స్ ఉన్నయ్ రా, కలియుగ పట్టణం వంటి ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపును దక్కించుకుంది. మరి పెళ్లయిన తర్వాత ఈ హీరోయిన్ సినిమాల్లో నటిస్తుందా లేదంటే పర్సనల్ లైఫ్ కి పరిమితం అయిపోతుందా అనేది చూడాలి.

Advertisement

రీసెంట్ గా తల్లిదండ్రులైన సెలబ్రిటీ కపుల్స్

ఇటీవలే హిందీ స్టార్ కపుల్ దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. అలాగే గత నెలలోనే నితిన్, ఆయన వైఫ్ శాలిని పండంటి మగ బిడ్డకు తల్లిదండ్రులయ్యారు. టాలీవుడ్ మరో యంగ్ హీరో శర్వానంద్ దంపతుల ఇంట్లోకి ఈ ఏడాది మార్చి లో మహాలక్ష్మి లాంటి పాప అడుగు పెట్టింది. ఇక తాజాగా చిత్రా శుక్లా ఈ లిస్టులో చేరిపోయింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×