E-Paper
Advertisement

Tirumala: తిరుమలలో అపశృతి వార్తలపై స్పందించిన టీటీడీ.. అసలు విషయం ఇదే

Tirumala: తిరుమలలో అపశృతి వార్తలపై స్పందించిన టీటీడీ.. అసలు విషయం ఇదే
Advertisement

Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లలో ఆలయ అధికారులు, సిబ్బంది నిమగ్నమయ్యారు. అయితే ఈ క్రమంలో జరిగిన ఓ ఘటన.. బ్రహ్మోత్సవాలకు ముందు అపశృతి ఘటనగా పలువురు అభివర్ణిస్తున్నారు. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే టీటీడీ అధికారులు అలర్ట్ అయ్యారు. అర్చకుల సూచనలతో చక్కదిద్దే పనికి పూనుకున్నారు. ఇంతకు అసలేం జరిగిందంటే..

తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా నేటి సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ సంధర్భంగా ధ్వజస్తంభం కొక్కెం ద్వారానే గరుడ పఠాన్ని ఎగురవేస్తారు అర్చకులు. అయితే ఈ కొక్కి అకస్మాత్తుగా విరిగిపోయిందని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కొక్కి విరిగినట్లు గుర్తించిన అధికారులు.. అర్చకులకు సమాచారం అందించారు. అర్చకులు హడావుడిగా ధ్వజస్తంభం వద్దకు చేరుకున్నారు. వెంటనే కొక్కిని ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకున్నారు. అయితే ఇటీవల తిరుమల లడ్డుకి వినియోగించిన నెయ్యి కల్తీకి గురైనట్లు వివాదం రేగగా.. యావత్ దేశం మొత్తం తిరుమలపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో తిరుమల పవిత్రతను కాపాడేందుకు టీటీడీ అన్ని చర్యలు తీసుకుంది. అలాగే బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసింది.

Advertisement

తిరుమలలో ఎటువంటి అపచారం జరగలేదు
వదంతులను నమ్మకండి-టీటీడీ

తిరుమల శ్రీవారి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా తొలిరోజైన ధ్వజారోహణం నాడు, ధ్వజస్తంభంపై గరుడ ధ్వజ పటాన్ని ఎగురవేసే తాలూకు కొక్కి విరిగిపోయిందని, ఇది అపచారమని కొన్ని ప్రసార మాధ్యమాల్లో, సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వదంతులు వస్తున్నాయని, శ్రీవారి భక్తులు ఇటువంటి వదంతులు నమ్మవద్దని టీటీడీ కోరింది. సాధారణంగా బ్రహ్మోత్సవాల మునుపే ప్రతి ఒక్క వాహనాన్ని తనిఖీ చేసుకోవడం ఆనవాయితీ. ఏవైనా భిన్నమైన వస్తువులు ఉంటే వాటిని తొలగించి వాటి స్థానంలో కొత్త వాటిని అమర్చడం సంప్రదాయం. అందులో భాగంగానే భిన్నమైన ద్వజపటం తాలూకు కొక్కిని అర్చకులు తొలగించి దాని స్థానంలో కొత్త దాన్ని ఏర్పాటు చేస్తున్నారని ప్రకటన విడుదల చేశారు టీటీడీ అధికారులు. అంతలో దీనిని అపచారం జరిగినట్లుగా కొన్ని ప్రచార మధ్యమాలు ప్రసారం చేయడం దురదృష్టకరం. తిరుమలలో ఎటువంటి అపచారం జరగలేదని, భక్తులు ఇటువంటి వదంతులు నమ్మవద్దని టీటీడీ అధికారులు ప్రకటించారు.

Advertisement

Also Read: Weekly Horoscope: వచ్చే వారం రోజుల పాటు మీ జాతకం ఎలా ఉండబోతుందో తెలుసా ?

ఇక,
పురాణాల ప్రకారం శ్రీనివాసుడు వేంకటాద్రిపై వెలిసిన తొలినాళ్లలోనే బ్రహ్మదేవున్ని పిలిచి లోకకల్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించారట. ఈ ప్రకారం ఆనందనిలయం మధ్యలో ఆవిర్భవించిన శ్రీవేంకటేశ్వరుడికి కన్యామాసంలోని శ్రవణ నక్షత్రం నాటికి పూర్తయ్యేలా బ్రహ్మదేవుడు తొమ్మిదిరోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించార‌ట‌. అందువల్లే ఇవి ‘బ్రహ్మోత్సవాలు’గా ప్రసిద్ధిచెంది అప్పటినుండి నిరాటంకంగా కొనసాగుతున్నాయి. అక్టోబ‌రు 4 నుండి 12వ తేదీ వ‌ర‌కు 9 రోజుల పాటు జ‌రుగ‌నున్న ఈ ఉత్సవాల్లో శ్రీ వేంక‌టేశ్వరస్వామివారి ఉత్సవమూర్తి అయిన శ్రీ మ‌ల‌య‌ప్పస్వామివారు వివిధ వాహ‌నాల‌పై ఆల‌య నాలుగు మాడ వీధుల్లో భ‌క్తుల‌కు దివ్యర్శనం క‌ల్పిస్తారు.

బ్రహ్మోత్సవ వాహ‌న‌సేవ‌లకు విచ్చేసే భ‌క్తులకు మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు టిటిడి ఏర్పాట్లు పూర్తిచేసింది. భ‌క్తులంద‌రికి ఎలాంటి ఇబ్బంది లేకుండా శ్రీ‌వారి వాహ‌న సేవ‌ల‌తో పాటు మూల‌విరాట్ దర్శనం క‌ల్పించేందుకు టిటిడిలోని అన్ని విభాగాలు సమన్వయంతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఉదయం వాహనసేవ 8 నుండి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 నుండి 9 గంటల వరకు జరుగుతుంది. గరుడవాహనసేవ సాయంత్రం 6.30 నుండి రాత్రి 11 గంటల‌ వరకు జరుగుతుంది. ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో భ‌క్తుల‌ను ఆక‌ట్టుకునేలా రంగ‌వ‌ల్లులు తీర్చిదిద్దారు. గ్యాల‌రీల‌లో వేచివుండే భ‌క్తుల సౌక‌ర్యార్థం తాగునీరు, మ‌రుగుదొడ్లు అందుబాటులో ఉంచారు. భ‌క్తులు మాడ వీధుల్లోని గ్యాలరీల్లోకి ప్రవేశించేందుకు, తిరిగి వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బారీకేడ్లు, క్యూలైన్ల గేట్లు పటిష్టంగా ఏర్పాటు చేశారు.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×