E-Paper
Advertisement

Thangalaan Release Date: ‘పుష్ప- 2’ మిస్సయిన డేట్‌కి ‘తంగలాన్’.. ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్

Thangalaan Release Date: ‘పుష్ప- 2’ మిస్సయిన డేట్‌కి ‘తంగలాన్’.. ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్
Advertisement

Thangalaan Release Date: కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తమిళ, తెలుగు సినీ ప్రేక్షకులు ఆయన సినిమాలకు ఫిదా అయిపోతారు. నటనలో ఆయన రూటే సపరేటు. సినిమా ఎలాంటిదైనా, అందులో పాత్ర ఏదైనా నటనతో హైప్ పెంచేస్తాడు. అలాగే కొత్త కొత్త కథలను ఎంచుకుంటూ ప్రయోగాలు చేస్తుంటాడు. విక్రమ్ తన సినీ కెరీర్ స్టార్టింగ్ నుంచే విభిన్న సినిమాలలో డిఫరెంట్ పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.

శివపుత్రుడు, అపరచితుడు వంటి సినిమాలతో తన రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ తర్వాత మల్లన్న, ఐ వంటి సినిమాలతో స్టార్ హీరోగా మారిపోయాడు. ఇలా వచ్చిన ప్రతి సినిమాలోనూ విలక్షణమైన పాత్ర చేస్తూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. స్టార్ డైరెక్టర్ పా. రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త సినిమా ‘తంగలాన్’.

Advertisement

ఇందులో మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఆమె కూడా తన సినీ కెరీర్‌లో డిఫరెంట్ రోల్‌ చేస్తున్న తొలి మూవీ ఇదే అని చెప్పొచ్చు. ఈ సినిమా కోసం యావత్ సినీ ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ ఫుల్ హైప్ క్రియేట్ చేశాయి. ఇక ఇటీవలే ట్రైలర్‌ను రిలీజ్ చేస్తూ మరింత బజ్ క్రియేట్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్‌లో విక్రమ్ లుక్ చూసి ఆశ్చర్యపోయారు. డిఫరెంట్ షేడ్స్‌ ఉన్న పాత్రలు చేయడంలో విక్రమ్ దిట్టే అయినా.. ఈ లుక్ మరింత ఆసక్తిని రేకెత్తించింది.

Also Read: చావును ఎదిరించేవాళ్లకు మాత్రమే ఇక్కడ జీవితం..

Advertisement

దీంతో ఈ ట్రైలర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో పీరియాడిక్ యాక్షన్‌గా రాబోతున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ముందుగా ఈ చిత్రాన్ని ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 26న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు. అయితే ఆ సమయంలో చాలా సినిమాలు రిలీజ్ ఉండటం.. అలాగే ఇతర కారణాల వల్ల సినిమా రిలీజ్ వాయిదా పడింది.

అప్పటి నుంచి కొత్త డేట్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకాభిమానులకు తాజాగా ఓ గుడ్ న్యూస్ అందింది. తంగలాన్ మూవీ కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఇందులో భాగంగా ఈ చిత్రాన్ని ఆగస్టు 15న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేస్తున్నట్లు ఓ పోస్టర్ ద్వారా తెలిపారు. దీంతో మూవీ ప్రియులు, విక్రమ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. కాగా కేఈ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ఇక ఆగస్టు 15న ఈ సినిమాతో పాటు రామ్ పోతినేని ‘డబుల్ ఇస్మార్ట్’ కూడా రిలీజ్ కానుంది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×