BigTV English

Skoda Discounts: ఊహించని ఆఫర్.. ఈ కారుపై రూ.2.5 లక్షల డిస్కౌంట్.. 4 రోజులే ఛాన్స్!

Skoda Discounts: ఊహించని ఆఫర్.. ఈ కారుపై రూ.2.5 లక్షల డిస్కౌంట్.. 4 రోజులే ఛాన్స్!

Skoda Discounts: కార్ మేకర్ స్కోడా తన కొడియాక్ ఎస్‌యూవీపై భారీ ఆఫర్లు ప్రకటించింది. మార్కెట్‌లోకి వచ్చి ఈ మోడల్ ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా కంపెనీ ఈ డిస్కౌంట్ తీసుకొచ్చింది. ఈ ఆఫర్ జులై 24 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్‌తో పాట కంపెనీ ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తోంది. కొడియాక్‌పై రూ.2.5 లక్షల క్యాష్ డిస్కౌంట్ ఇస్తోంది. ఈ ఆఫర్ L&K వేరియంట్‌పై వర్తిస్తుంది. మూడు కలర్ ఆప్షన్స్‌లో కారును కొనుగోలు చేయవచ్చు. అందులో మూన్ లైట్, లావా బ్లూ, మ్యాకిజ్ బ్లాక్ అనే కలర్స్ ఉన్నాయి. వీటి కారణంగా కంపెనీ పాత స్టాక్ క్లియర్ అవుతుందని భావిస్తోంది. కంపెనీ త్వరలో తన కొత్త మోడల్ విడుదల చేయనున్నట్లు సమాచారం.


భారత మార్కెట్లో కొత్త కోడియాక్ లాంచ్ చేయడానికి ముందు దాని క్రాష్ టెస్ట్ రేటింగ్ రిపోర్ట్ వచ్చింది. ఇటీవల ఈ కారు యూరో NCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌  సాధించింది. ఆ తర్వాత కంపెనీ సురక్షితమైన వాహనాల జాబితాలోకి వచ్చింది. కంపెనీ వచ్చే ఏడాది ప్రారంభంలో 2024 కోడియాక్‌ను విడుదల చేస్తుంది.

Also Read: Upcoming SUVs in India: కార్ లవర్స్‌కు పండగే.. త్వరలో 5 కొత్త ఎస్‌యూవీలు..!


స్కోడా కొడియాక్ క్రాష్ టెస్ట్ రిపోర్ట్ స్కోడా కొడియాక్ కొత్త మోడల్ యూరో ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్‌లో అద్భుతంగా పనిచేసింది.కొత్త స్కోడా కొడియాక్ అడల్ట్ సేఫ్టీ టెస్ట్‌లో 89 శాతం, చైల్డ్ సేఫ్టీ టెస్ట్‌లో 83 శాతం, పీడెస్టల్ ప్యాసింజర్ సేఫ్టీ టెస్ట్‌లో 82 శాతం స్కోర్ చేసింది. ఈ కారు భద్రతా ఫీచర్లు మొత్తం 72 శాతం పాయింట్లను పొందాయి.

 

Euro NCAP ఫ్రంటల్ ఆఫ్‌సెట్ పరీక్షలో ఈ కారు స్థిరంగా ఉన్నట్లు గుర్తించింది. ఈ కారు అంతర్జాతీయ మార్కెట్‌లో అందుబాటులో ఉంది.  ఈ కారు ధరల గురించి స్కోడా ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. అయితే ఈ కారు భారతీయ రోడ్లపై టెస్టింగ్ సమయంలో చాలాసార్లు గుర్తించబడింది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధరను కంపెనీ రూ.15 నుంచి 20 లక్షలుగా ఉండొచ్చు.

స్కోడా విక్రయాల విషయానికి వస్తే జూన్‌లో 1,230 యూనిట్లు స్లావియా, 1,198 యూనిట్లు కుషాక్, 137 యూనిట్లు కొడియాక్, 1 యూనిట్ సూపర్బ్ అమ్ముడయ్యాయి. ఈ విధంగా మొత్తం 2,566 యూనిట్లను విక్రయించింది. స్కోడాకు ఈ సంవత్సరంలో ఇది మూడవ అత్యల్ప విక్రయాలు. వోక్స్‌వ్యాగన్‌కి ఇది మూడవ అత్యల్ప విక్రయాలు.

Also Read: Tata Punch Discounts: టాటా పంచ్.. ఆ వేరియంట్‌పై ఫస్ట్ టైమ్ భారీ డిస్కౌంట్.. ఇప్పడు ధర ఎంతంటే?

రెండు కంపెనీలు కలిపి 5726 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగాయి. స్కోడా తన లగ్జరీ సెడాన్ సూపర్బ్‌ను మార్చి 2024లో భారత మార్కెట్లో తిరిగి విడుదల చేసింది. అయితే గత 2 నెలల్లో దీని విక్రయాల గణాంకాలు పేలవంగా ఉన్నాయి. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.54 లక్షలు. అయితే కొత్త కారుతో కంపెనీ తిరిగి లాభాలు పొందాలని చూస్తోంది.

Related News

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Jio Offers: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?

Big Stories

×