E-Paper
Advertisement

Thangalaan Trailer: చావును ఎదిరించేవాళ్లకు మాత్రమే ఇక్కడ జీవితం..

Thangalaan Trailer: చావును ఎదిరించేవాళ్లకు మాత్రమే ఇక్కడ జీవితం..
Advertisement

Thangalaan Trailer: కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ హీరోగా నటిస్తున్న చిత్రం తంగలాన్. పా. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో పార్వతి మరియు మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సిఉండగా.. కొన్ని కారణాల వలన వాయిదా పడుతూ వస్తుంది.

తాజాగా తంగలాన్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కార్మికుల జీవితాలను డైరెక్టర్ ఇందులో చూపించాడు. గనులలో గోల్డ్ ను వెతికితీయడం ఇప్ అప్పట్లో అంత ఈజీగా జరిగేది కాదు. దానికోసమే సపరేట్ కార్మికులు ఉండేవారు. ఆ తెగకు చెందినవారే గోల్డ్ తీయడానికి వెళ్తూఉంటారు.

Advertisement

భీకర గిరిజన నాయకుడు తంగలన్ మరియు అతని తెగ వారు తమ గ్రామంలో బంగారాన్ని కనుగొనడానికి బ్రిటిష్ జనరల్ లార్డ్ క్లెమెంట్‌కు సహాయం చేస్తారు. బంగారం కోసం వెతుకుతున్నప్పుడు, గ్రామస్థులు ఆరతి అనే మంత్రగత్తె ఆగ్రహానికి గురవుతారు. తంగలాన్ తన శక్తితో ఆరతిని ఆపడానికి బయలుదేరాడు. అసలు మంత్రగత్తెకు ఎందుకు కోపం వచ్చింది.. ? ఆరతిని.. తంగలాన్ ఆపగలిగాడా.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ట్రైలర్ తో సినిమాపై ఒక్కసారిగా హైప్ పెంచేశాడు డైరెక్టర్. ఈ సినిమా కోసం విక్రమ్ తనను తాను మార్చుకున్న విధానం ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఇప్పుడు కూడా తంగలాన్ రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించలేదు. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Advertisement

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×