BigTV English

Thangalaan: విక్రమ్ పెర్ఫార్మెన్స్ కోసం వెయిటింగ్.. ‘తంగలాన్’ సెన్సార్ పూర్తి.. రన్ టైం ఎంతంటే..

Thangalaan: విక్రమ్ పెర్ఫార్మెన్స్ కోసం వెయిటింగ్.. ‘తంగలాన్’ సెన్సార్ పూర్తి.. రన్ టైం ఎంతంటే..

Thangalaan: కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఎన్నో తెలుగు సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ఈ హీరో డిఫరెంట్ రోల్స్ చేయడానికి ముందుంటాడు. ఎలాంటి సినిమా అయినా.. అందులో అతడి పాత్ర ఎంత డిఫికల్ట్‌గా ఉన్నా చేసేందుకు వెనుకాడడు. పాత్రలో నటించడం కాదు.. జీవించేసే గుణం ఆయనది. ఇప్పటికీ చేసిన ఎన్నో సినిమాల్లో డిఫరెంట్స్ షేడ్స్‌లో కినిపించి అదరగొట్టేశాడు. ఇక ఇప్పుడు తనలోని మరో షేడ్‌ను చూపించేందుకు సిద్ధమయ్యాడు.


విక్రమ్ హీరోగా పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కొత్త సినిమా ‘తంగలాన్’. ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో జరిగిన రియల్ లైఫ్ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై ఫుల్ హైప్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా ట్రైలర్‌కు సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చింది. నిజంగా ఈ మూవీలో విక్రమ్ రోల్ అత్యంత భయంకరంగా ఉండటమే కాకుండా క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది.

Also Read: చావును ఎదిరించేవాళ్లకు మాత్రమే ఇక్కడ జీవితం..


దీంతో ఈ ట్రైలర్ రిలీజ్ అయిన అతి కొద్ది సమయంలోనే యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇక ఈ మూవీలో విక్రమ్ పెర్ఫార్మెన్స్ కోసం ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఆమె కూడా ఈ మూవీలో చాలా డిఫరెంట్ రోల్‌లో కనిపించనుంది. కాగా ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేశారు. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే తంగలాన్ రిలీజ్‌కు ఇంకా రెండు వారాలు సమయం ఉండగా.. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి గానూ సెన్సార్ యూనిట్ యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే.. ఏ ఒక్క చిన్న కట్ కూడా లేకుండా ఈ సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇక దీని రన్ టైం విషయానికొస్తే.. ఈ సినిమా 156 నిమిషాల 59 సెకండ్ల పాటు రన్ టైం కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అంటే 2 గంటల 36 నిమిషాల 59 సెకన్లు ఉంటుందన్నమాట. ఈ అప్డేట్‌తో విక్రమ్ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×