E-Paper
Advertisement

Pawan Samantha: పవన్‌ షూ.. సమంత చెప్పులు.. ధర తెలిస్తే అవాక్కే!

Pawan Samantha: పవన్‌ షూ.. సమంత చెప్పులు.. ధర తెలిస్తే అవాక్కే!
Advertisement
pawan shoe

Pawan kalyan Latest Movie News(Latest Tollywood News): ‘బ్రో’ మూవీ పోస్టర్ చూశారుగా. పోలా.. మామాఅల్లుల్ల లుక్ అదిరిపోలా. ఈ పోస్టర్ ఫుల్‌గా వైరల్ అయింది. సోషల్ మీడియాలో షేర్లు, కామెంట్లతో ఫుల్ పబ్లిసిటీ. ఆ ఫోటోలో ఆ ఇద్దరు హీరోలతో పాటు పవన్ కల్యాణ్ వేసుకున్న ‘షూ’ మరింత ఆసక్తి రేపుతోంది.

వెరైటీగా ఉన్నాయా షూ. ముందు బ్లాక్ కలర్.. వెనకాల వైట్. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఖతర్నాక్‌గా కనిపిస్తున్నాయి పవన్ వేసుకున్న షూ. అవి కూడా లావుగా, ఎత్తుగా.. గ్రాండ్‌గా ఉన్నాయ్. ఆ పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుంచీ పవన్ కల్యాణ్ షూ కోసం ఆన్‌లైన్లో తెగ సెర్చ్ చేస్తున్నారు ఫ్యాన్స్. లాస్ట్‌కి అవి ఏం షూనో, ఎక్కడి షూనో, వాటి రేట్ ఎంతో తెలుసుకుని.. అవాక్కవుతున్నారు. వామ్మో.. అంతా? అని నోరెళ్లబెడుతున్నారు.

Advertisement

పవన్ వేసుకున్న షూ.. పారిస్‌కు చెందిన ప్రముఖ కంపెనీ ‘బాల్మేన్’ తయారు చేసిందట. ఆ షూ ధర.. అక్షరాల లక్ష రూపాయలు. అవును, లక్షే. ‘బ్రో’లో పవన్ కల్యాణ్ కోసం ఇలాంటివి 3 జతలు తెప్పించారని తెలుస్తోంది. ఈ విషయం తెలిసి తమ అభిమాన హీరో వేసుకున్నలాంటి షూ వేసుకోవాలని ఆశపడిన ఫ్యాన్స్ ఫుల్‌గా డిసప్పాయింట్ అవుతున్నారట. ఎంత అభిమానం ఉన్నా.. లక్ష పెట్టి షూ కొనలేరుగా. కనీసం అలాంటి డూప్లికేట్ షూ అయినా దొరుకుతాయేమోనని ఆన్‌లైన్ సైట్లను గాలించేస్తున్నారు పీకే ఫ్యాన్స్. పవనా..మజాకా.

పవన్ షూ లానే.. ఇటీవల సమంత చెప్పులు సైతం వైరల్ అవుతున్నాయి. ఆమె మరింత రిచ్ చెప్పులు వేసుకుని కనిపించారు. ప్రస్తుతం సమంత ‘సిటడెల్‌’ ఇండియన్‌ వెర్షన్‌లో నటిస్తున్నారు. ఇటీవల ఆ సిరీస్‌ షూటింగ్‌లో పాల్గొని.. హైదరాబాద్‌ తిరిగి వస్తూ.. ఎయిర్‌పోర్టులో కెమెరాకు చిక్కారు సమంత. బ్యాక్ ప్యాక్, వాటర్ బాటిల్, నడుముకు జాకెట్‌తో.. ఐఫోన్లో ఎవరితో మాట్లాడుతూ వెళ్తుండగా.. క్లిక్ మనిపించారు. ఆ ఫోటో సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. సమంత లుక్స్‌తో పాటు ఆమె వేసుకున్న స్లైడ్స్ సైతం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయ్.

Advertisement

సమంత వేసుకున్న చెప్పుల కోసం ఆన్‌లైన్లో సెర్చ్ చేయగా.. అవి మామూలు స్లిప్పర్స్ కావని తేలింది. ‘లూయిస్‌ విట్టన్‌ పూల్‌ స్లైడ్స్‌’. అంతర్జాతీయ బ్రాండ్. అత్యంత ఖరీదైన ఉత్పత్తులను తయారు చేస్తుందీ కంపెనీ. ఆ సంస్థకు చెందిన సమంత వేసుకున్న చెప్పుల ధర.. రూ.1.30 లక్షలు అని తెలిసి వామ్మో అంటున్నారు. ఎంతైనా హీరోయిన్ కదా.. ఆ మాత్రం ఉంటుందిలే అనుకుంటున్నారు.

పవన్ అయినా, సమంత అయినా.. అట్లుంటది సినిమావాళ్లతోని.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×