Big Stories

Air Pollution : గాలి కాలుష్యాన్ని కంట్రోల్ చేసే పరికరం.. హైటెక్ టెక్నాలజీతో..

Air Pollution : గాలి కాలుష్యం అనేది విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే.. దానిని అదుపు చేయడానికి శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. కానీ ఈ గాలి కాలుష్యానికి కొలమానం ఏంటి అనేది చాలామందికి తెలియదు. గాలిలో పెరుగుతున్న హానికరమైన గ్యాసులను గమనిస్తూ ఉండడం వల్ల గాలి కాలుష్యం ఎంత శాతంలో ఉందని తెలుస్తోంది. అలా కాకుండా ఈ కాలుష్యాన్ని కనుక్కోవడం కోసం, దానిని అదుపు చేయడం కోసం పలువురు విద్యార్థులు ఒక హైటెక్ టెక్నాలజీ కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

- Advertisement -

ప్రస్తుతం గాలి కాలుష్యాన్ని కంట్రోల్ చేయడానికి యాంటీ స్మాగ్ గన్స్, స్మాగ్ టవర్స్ లాంటి వాటిని ఉపయోగిస్తున్నారు. కానీ దానికంటే మెరుగ్గా గాలి కాలుష్యాన్ని క్యాచ్ చేయడానికి, తగ్గించడానికి ఉపయోగించే టెక్నాలజీ కోసం సీఎస్సైఆర్ ఇండియన్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ (ఐఐటీఆర్) విద్యార్థులు ఒక హైటెక్ పరికరాన్ని తయారు చేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. పైగా ప్రస్తుతం ఉపయోగిస్తున్న టెక్నాలజీలకు దీనికి తేడా ఏంటి అని కూడా వారు వివరంగా తెలిపారు.

- Advertisement -

ఈ కొత్త టెక్నాలజీతో తయారు చేసే పరికరం గాలి కాలుష్యాన్ని పీఎమ్ 10 నుండి పీఎమ్ 2.5 వరకు తగ్గించడంతో పాటు గాలిలోని ఎన్నో హానికరమైన గ్యాసులను తొలగించడానికి కూడా ఉపయోగిపడుతుందని విద్యార్థులు చెప్తున్నారు. ప్రస్తుతం గాలి కాలుష్యాన్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగిస్తున్న పరికరాల్లో ఈ సౌలభ్యం లేదని అన్నారు. ఇప్పటికే ఈ పరికరం యొక్క డిజైన్‌ను, బేసిక్ మోడల్‌ను తయారు చేశారు విద్యార్ధులు. దీనికోసం వీరికి ఇతర విశ్వవిద్యాలయాలు, ఇన్‌స్టిట్యూట్స్ నుండి గ్రాంట్ కూడా లభించినట్టు తెలుస్తోంది.

విద్యార్థులు బేసిక్ మోడల్‌ను తయారు చేసిన తర్వాత నిపుణులతో ఈ పరికరాన్ని పూర్తి చేయించాలని నిర్ణయించుకున్నారు. అందుకే దీనిని బయట ఏజెన్సీలకు పంపినట్టు సమాచారం. ముందుగా ఈ ఆలోచన చేసిన విద్యార్థులు అందరినీ ఐఐటీఆర్ సంస్థ అభినందించింది. ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ క్వాలిటీ అనేది పెంచడం ఇప్పుడు అత్యవసరంగా మారిందని, ఆ పని చేయడం కోసం తమ విద్యార్థులు కూడా పాటుపడడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇది ఇన్‌స్టిట్యూట్ మొత్తం గర్వపడే ప్రయోగంగా మారుతుందని యాజమాన్యం అభిప్రాయం వ్యక్తం చేసింది.

ఈ ఇన్‌స్టిట్యూట్ గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో గాలి కాలుష్యంపై ప్రయోగాలు చేస్తుందని విద్యార్థులు బయటపెట్టారు. అందుకే ఇప్పుడు ఉన్న పరికరాల కంటే మెరుగ్గా టెక్నాలజీతో పరికరాన్ని తయారు చేయగలిగామని తెలిపారు. ఇప్పటివరకు ఇంత మెరుగ్గా గాలి కాలుష్యాన్ని కంట్రోల్ చేసే పరికరం ఎవరూ తయారు చేయలేదని బయటపెట్టారు. ఈ పరికరంతో కార్బన్ మోనోక్సైడ్, హైడ్రోకార్బన్ లాంటి గ్యాసులు కూడా కంట్రోల్ అవుతాయని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ టెక్నాలజీ బయటికి వస్తే.. గాలి కాలుష్యం అనుకున్న రీతిలో అదుపులోకి వస్తుందని విద్యార్థులు భావిస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News