BigTV English

Sobhita Akkineni: అక్కినేని కోడలి వైభోగం.. అఖిల్ రిసెప్షన్ లో శోభితా చేతిలో ఉన్న బ్యాగ్ ఎన్ని లక్షల్లో తెలుసా ?

Sobhita Akkineni: అక్కినేని కోడలి వైభోగం.. అఖిల్ రిసెప్షన్ లో శోభితా చేతిలో ఉన్న బ్యాగ్  ఎన్ని లక్షల్లో తెలుసా ?

Sobhita Akkineni: అక్కినేని కుటుంబంలో ఈ మధ్యనే అఖిల్ అక్కినేని వివాహం  జరిగిన విషయం తెలిసిందే. జూన్ 6న అఖిల్ అక్కినేని- జైనబ్ ల వివాహం ఎంతో సింపుల్ గా కొద్దిమంది బంధుమిత్రుల మధ్యలో జరిగింది. అక్కినేని నాగార్జున వారసుడిగా అఖిల్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే  ఇప్పటికీ తండ్రి, అన్నలాగా ఒక మంచి విజయాన్ని అందుకోలేక అయ్యగారు కష్టపడుతున్నారు. మధ్యలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో కెరీర్ లోనే మొదటి హిట్ అందుకున్న అఖిల్ ఇప్పటివరకు ఆ హిట్ తోనే గడిపేస్తున్నాడు. ఇక ఎన్నో ఆశలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఏజెంట్ భారీ పరాజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా ఓటీటీకి కూడా నోచుకోలేని ఈ సినిమా ఈ మధ్యనే ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చినా  ఇక్కడ కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీంతో పెళ్లి చేస్తే అయినా కొడుకు లైఫ్ మారుతుందని నాగ్.. అఖిల్ కి పెళ్లి చేసినట్లు తెలుస్తోంది.


 

అక్కినేని నాగచైతన్య- శోభిత పెళ్లిలో అఖిల్ కు  కాబోయే భార్యని నాగ్ పరిచయం చేసి కొడుకు కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టినట్లు తెలిపాడు. అక్కినేని నాగార్జున చిన్న కొడుకు అఖిల్ పెళ్లి అంటే ఇంకెంత గ్రాండ్ గా జరుగుతుందో అని అనుకున్నారు. కానీ, నాగ్ మాత్రం అయ్యగారి పెళ్లిని చాలా సింపుల్ గా జరిపించేశారు. అయితే పెళ్లి సింపుల్ గా జరిగినా అఖిల్ రిసెప్షన్ మాత్రం చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ రిసెప్షన్ కి టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు అతిథులుగా విచ్చేశారు. ఈ వేడుక నుంచి రోజుకొక ఫోటో బయటకు వచ్చి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.


 

తాజాగా అఖిల్  రిసెప్షన్ నుంచి శోభిత అక్కినేని ఫోటోలు బయటకు వచ్చాయి.  సమంతతో విడిపోయాక నాగచైతన్య శోభితాను రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.  పెళ్లికి ముందు ఎంత గ్లామర్ ఒలకబోసినా కూడా పెళ్లి తర్వాత శోభిత అలాంటివేమీ చేయకుండా అక్కినేని పెద్ద కోడలిగా తనకు వచ్చిన గౌరవాన్ని కాపాడుకుంటూ వస్తుంది. అక్కినేని ఈవెంట్స్ లో ప్రతి చోట ఆమె ఎంతో పద్ధతిగా కనిపిస్తూ సోషల్ మీడియాలో ట్రోల్  అవ్వకుండా, తన పేరును.. అక్కినేని గౌరవాన్ని కాపాడుకుంటూ వస్తుంది.

 

ఇక అఖిల్ రిసెప్షన్ లో  కూడా శోభిత చీరకట్టులోనే కనిపించి కనువిందు చేసింది.  అయితే ఒక డిజైనర్ బ్లౌజ్ తో శోభిత రిసెప్షన్ మొత్తానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. ఇంకా చెప్పాలంటే పెళ్లికూతురు కన్నా శోభితనే మరింత అందంగా ఉందని కొందరు కామెంట్స్ పెట్టడం విశేషం. గోల్డ్ కలర్ డిజైనర్ బ్లౌజ్ పై రెడ్ కలర్ ప్లెయిన్ చీర కట్టుకొని చేతిలో బ్లాక్ కలర్ బ్యాగ్ పట్టుకొని అందంగా కనిపించింది.  ఇక ఈ రిసెప్షన్లో శోభిత పట్టుకున్న బ్యాగ్ గురించే సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది.

 

చాలా సింపుల్ గా కనిపిస్తున్న ఈ బ్యాగ్ ధర కొన్ని లక్షలు ఉండడంతో నెటిజెన్స్ వామ్మో అంత ధర అని షాక్ అవుతున్నారు. క్రిస్టియన్ డియోర్ అనే ఇంటర్నేషనల్ బ్రాండ్ కు చెందిన ఈ బ్యాగ్ ఖరీదు దాదాపుగా రూ. 3.37 లక్షలు ఉంటుందని తెలుస్తుంది. దీంతో ఒక్క బ్యాగ్ ఖరీదు అన్ని లక్షలా  అంటూనెటిజన్స్ నోర్లు వెళ్ళబెడుతున్నారు. ఇక ఇంకొంతమంది అక్కినేని కోడలు వైభోగం అలా ఉంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం శోభిత చాలా సెలెక్టెడ్ గా కథలను ఎంచుకుంటూ వస్తుంది .త్వరలోనే ఆమె నటించిన సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుందని తెలుస్తుంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×