Naga Babu : మెగా బ్రదర్ నాగబాబు (Nagababu)అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాద(Plane Crash) ఘటన గురించి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇది మన ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు తప్ప మిగిలిన అందరూ మరణించారు. అలాగే ఈ విమానం హాస్టల్ భవనంపై కూలిపోవడంతో హాస్టల్లో భోజనం చేస్తున్న 20 మంది మెడికల్ విద్యార్థులు కూడా మరణించిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఘటన గురించి ఎంతోమంది సినిమా ఇండస్ట్రీకి చెందినవారు రాజకీయ నాయకులు స్పందిస్తూ తమ సంతాపం తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగా బ్రదర్ నాగబాబు కూడా ఈ ఘటన పట్ల స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారింది.
చిరంజీవి అన్నయ్య..
ఈ సందర్భంగా నాగబాబు ట్వీట్ చేస్తూ…”అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ నా మనసును కలచివేసింది. చాలా కాలం క్రితం ఫ్యామిలీ పర్సనాలిటీస్ ఉన్న చెన్నై ఫ్లైట్ తిరుపతిలో ఎక్కడో ల్యాండ్ అయింది. అందులో మా అందరికీ అత్యంత ప్రియమైన మా అన్నయ్య చిరంజీవి (Chiranjeevi) మా సుస్మిత (Susmitha)పాప కూడా ఉన్నారు. ఈ ఫ్లైట్ తిరుపతి పొలాలలో ల్యాండ్ అయిందని వార్త బయటకు రావడంతో అందులో ఉన్న మా అన్నయ్య మా పాప సేఫ్ గా ఉన్నారా? లేదా? ఆందోళన నా మనస్సు కలచివేసింది . ఈ ఫ్లైట్ సేఫ్ గా ల్యాండ్ అయిందని, అన్నయ్య పాపతో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా సేఫ్ అని తెలిసిన తర్వాత మనసు కుదట పడిందని తెలిపారు. ఆ ఫ్లైట్ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ ఈరోజుకి నా మనసులో నుంచి వెళ్లి పోలేదని అలాంటిది ఈరోజు అహ్మదాబాద్ లో జరిగిన ఈ ఫ్లైట్ క్రాష్ విజువల్స్ చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని తెలిపారు.
ఎన్నో ఆశలతో..
ఎంతోమంది యువకులు వాళ్ళ భవిష్యత్తు కోసం ఎన్నెన్నో ఆశలతో ఆఫ్ లైట్ ఎక్కారో, ఎంతమంది పెద్దవాళ్లు వాళ్ళ జీవిత చరమాంకంలో రిటైర్మెంట్ జీవితాన్ని అద్భుతంగా ఊహించుకుంటూ ఆ ఫ్లైట్ ఎక్కారో, ఏ తల్లి తన బిడ్డల దగ్గరకి చేరాలని ఆత్రంతో ఫ్లైట్ ఎక్కారో, ఇలా ఎంతోమంది ఎన్నో ఆశలతో ఈ విమానం ఎక్కి చాలా క్షేమంగా వారి ప్రయాణాన్ని చేరుకొని ఆత్మీయులతో గడపాలని ఊహించుకున్నారు. ఇలా వీరి ప్రయాణం ప్రారంభమైన కాసేపటికే ఫ్లైట్తో ఏమాత్రం సంబంధంలేని మెడికో స్టూడెంట్స్ హాస్టల్లో లంచ్ చేస్తుంటే పిడుగుపాటుల వారిపై ఈ ఫ్లైట్ కూలిపోవడం విషాదకరమని తెలిపారు.
ఇంతకన్నా పెద్ద ఆపద రాకూడదు…
మెడికో స్టూడెంట్స్ ఎన్నో ఆశలతో డాక్టర్ అవుదామని చదువుకుంటున్న వారి జీవితాల మీద తల్లిదండ్రులు ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నారు.. ఏమనాలో, ఏమి ఆలోచించాలో కూడా తెలియని పరిస్థితి. ఈ ఘటనతో ఎన్నో నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఒక్క క్షణం ఇది నిజం కాదు పీడకల అయితే ఎంతో బాగుండు అనిపించింది. అన్ని మతాల దేవుళ్లను నమ్మేవారు ఆఫ్లైట్లో ఉన్నారు. మరి ఏ దేవుడు ఎక్కడికి వెళ్లి పోయారో తెలియదు. ఈ శతాబ్దానికి ఇంతకంటే పెద్ద ఆపద రాకూడదు. చనిపోయిన వాళ్లకు కన్నీళ్లతో బాధ తప్ప హృదయాలతో వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను”అంటూ నాగబాబు సుదీర్ఘమైనటువంటి పోస్ట్ చేశారు.
అహమ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ నా మనస్సుని కలచి వేసింది .చాలా సంవత్సరాల క్రితం ఎంతో మంది filmy పర్సనాలిటీస్ ఉన్న చెన్నై ఫ్లైట్ తిరుపతి లో ఎక్కడో ల్యాండ్ అయ్యింది.అందులో మా అందరికీ అత్యంత ప్రియమైన మా అన్నయ్య మా స్వీటీ(సుష్మిత)పాపా ఉన్నారు .ఫ్లైట్ తిరుపతి పొలాల్లో ల్యాండ్ అయ్యిందంట మా…
— Naga Babu Konidela (@NagaBabuOffl) June 12, 2025