BigTV English
Advertisement

OTT Movies : ఓటీటీలోకి వచ్చేసిన హారర్ సినిమాలు.. వీకెండ్ వీటిని మిస్ అవ్వకండి..

OTT Movies : ఓటీటీలోకి వచ్చేసిన హారర్ సినిమాలు.. వీకెండ్ వీటిని మిస్ అవ్వకండి..

OTT Movies : థియేటర్లలోకి సినిమాలు రాక ముందే డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ను బుక్ చేసుకుంటున్నాయి. సినిమాలు సక్సెస్ టాక్ ను అందుకుంటే ఓటీటీలోకి ఆలస్యంగా స్ట్రీమింగ్ కు వస్తాయి. లేదంటే రెండు, మూడు వారాల్లోనే అడుగుపెట్టేస్తున్నాయి. ఇవాళ బోలెడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేసాయి. అందులో హారర్ సినిమాలను ఇష్టపడేవారికి పండగే. రెండు హారర్ కామెడీ సినిమాలు ఓటీటీలోకి వచ్చేసాయి. ఇక ఆలస్యం ఎందుకు ఆ సినిమాలు ఏవి? ఎక్కడ చూడొచ్చునో ఒకసారి చూసేద్దాం..


డెవిల్స్ డబుల్: నెక్ట్స్ లెవెల్ ఓటీటీ..

తమిళ హీరో సంతానం నటించిన లేటెస్ట్ మూవీ డెవిల్స్ డబుల్.. గీతిక తివారీ, యాషిక ఆనంద్, డైరెక్టర్స్ గౌతమ్ వాసుదేవ్ మీనన్, సెల్వరాఘవన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఎస్ ప్రేమ్ ఆనంద్ దర్శకత్వం వహించారు.. గత నెల వివాదాలతో థియేటర్లలోకి వచ్చేసింది. అయితే నెలలోపే ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ ఈ మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది.


ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే..

ఈ చిత్రంలో సంతానం సినిమాలకు రివ్యూలు చెప్పే యూట్యూబర్ పాత్రలో నటించాడు. సినిమాకు రివ్యూలు ఇస్తూ వాటిని ఫ్లాప్ చేస్తుంటాడు సంతానం. అయితే సంతానం రివ్యూ వ‌ల‌న న‌ష్ట‌పోయిన ఒక వ్య‌క్తి దెయ్యం అయ్యి అత‌డిపై ప‌గబ‌ట్టి.. ఒక లూప్‌లో ప‌డేస్తాడు. అయితే ఆ లూప్‌లో చిక్కుకుపోయిన సంతానం మోట్ట రాజేంద్రన్ బ‌య‌ట‌కి ఎలా వ‌చ్చారు అనేది ఈ సినిమా క‌థ‌ని తెలుస్తుంది.. ఈ మూవీ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మూవీని మిస్ అవ్వకుండా తప్పక చూడాల్సిందే..

సమంత శుభం ఓటీటీ.. 

ఇవాళ ఓటీటీ ల్లోకి వచ్చేసిన సినిమాలో సమంత నిర్మించిన మొదటి మూవీ శుభం కూడా ఉంది. స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు నిర్మాతగా మారి నిర్మించిన శుభం సినిమాకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగులో హారర్ కామెడీ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీకి ప్రవీణ్ కండ్రేగులు దర్శకత్వం వహించారు. ఈ మూవీలో హర్షిత్ రెడ్డి, సమంత, శాలిని కొండెపూడి, శ్రీయా కొంతం, వంశీధర్ గౌడ్, గవిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, చరణ్ పెర్రి ప్రధాన పాత్రల్లో నటించారు. మే 9 న థియేటర్లలోకి వచ్చేసిన ఈ మూవీ పర్వాలేదనే టాక్ ను సొంతం చేసుకుంది.నేడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. జియో హాట్‌స్టార్‌లో ఇవాళ్టీ నుంచి శుభం ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, మలయాళం, కన్నడ, తమిళం, హిందీ వంటి ఐదు భాషల్లో శుభం ఓటీటీ రిలీజ్ అయింది..

Also Read : ఇదేక్కడి సినిమా రా.. సీన్ సీన్ కో ట్విస్ట్.. ఒంటరిగా చూస్తే అంతే…

ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. 

ఈ మూవీలోని ఆడవాళ్లు అంతా కూడా రాత్రి తొమ్మిది అవ్వగానే టీవీలో వచ్చే ఒక సీరియల్ ను చూస్తారు. ఆ సీరియల్ చూస్తున్నంత సేపు దెయ్యాలైన భార్యలను భర్తలు ఎలా కాపాడుకున్నారన్నదే శుభం కథ. ఇక ఈ హారర్ కామెడీ జోనర్‌లో ఈ రెండు ఓటీటీ సినిమాలు వీకెండ్‌లో చూసేందుకు బెస్ట్.. ఈ వీకెండ్ ఫుల్ ఎంజాయ్ చెయ్యాలంటే వీటిని అస్సలు మిస్ అవ్వకండి..

Tags

Related News

OTT Movie : యాక్సిడెంట్ తరువాత కళ్ళు తెరిచి చూస్తే బంకర్‌లో… కన్నింగ్ గాడి ట్రాప్‌లో… స్పైన్ చిల్లింగ్ సర్వైవల్ థ్రిల్లర్

OTT Movie : పసికూనను తింటేగానీ తీరని ఆకలి… సూపర్ హీరోలను ఈకల్లా పీకి పారేసే మాన్స్టర్… ఫుల్ యాక్షన్ ధమాకా

Baramulla OTT : పట్టపగలే పిల్లలు అదృశ్యం… కుమార్తె రూమ్ లో కుక్క వాసన… ఇంటెన్స్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్

The Bengal Files: ఓటీటీకి వివాదస్పద చిత్రం.. ‘ది బెంగాల్‌ ఫైల్స్‌’, ఎక్కడ చూడాలంటే!

OTT Movie : కళ్ళతో చూస్తే ఆత్మహత్య… ప్రపంచాన్ని తుడిచి పెట్టే మిస్టీరియస్ శక్తి… గ్రిప్పింగ్ థ్రిల్లర్… ఊహించని ట్విస్టులు

OTT Movie : దసరా ఉత్సవాలపై 40 నిమిషాల మూవీ…. ‘ప్రొద్దుటూరు దసరా’ ఏ ఓటీటీలో ఉందో తెలుసా?

OTT Movie : స్నేహితుడిని ఇంటికి ఆహ్వానిస్తే… ఒక్కొక్కరిని మట్టుబెడుతూ పని కానిచ్చే సైకో… గూస్ బంప్స్ తెప్పించే థ్రిల్లర్

Avihitham: పితృస్వామ్య రాజ్యంలో బాధితులుగా కూతుర్లు.. ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం..!

Big Stories

×