Ajun Son Of Vyjayanthi Teaser: కళ్యాణ్ రామ్, సయీ మంజ్రేకర్ జంటగా విజయశాంతి కీలక పాత్రలో తెరకెక్కుతున్న మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఈరోజు మూవీ రూపొందుతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నేలకు ఉన్నాయి. ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన పోస్టర్స్ మూవీ పై ఎక్స్పెక్టేషన్స్ని పెంచేసాయి. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ వీడియో వైరల్ అవుతుంది.. మాస్ డైలాగులతో అదిరిపోయే యాక్షన్ సీన్లతో ఆ టీజర్ రిలీజ్ అయిన క్షణాల్లోనే యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది..
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ బింబిసారా మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఆ మూవీ తర్వాత కథల ఎంపిక విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం భారీ యాక్షన్ మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఆ మూవీనే అర్జున్ సన్నాఫ్ వైజయంతి.. అలనాటి హీరోయిన్ లేడి బాస్ విజయశాంతి మెయిన్ రోల్ లో కనిపిస్తుంది. అనుకున్నట్లుగా ఆమె పోలీస్ పాత్రలో నటించగా.. కొడుకు పాత్రలో కళ్యాణ్ రామ్ నటిస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు బయటకు వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు తాజాగా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.. విజయశాంతి మళ్ళీ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించబోతుంది. విజయశాంతి తనయుడి పాత్రలో కళ్యాణ్ రామ్ నటిస్తున్నాడు.
Also Read : మంచు విష్ణు పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్.. అందులో వీక్ అంటూ..
టీజర్ విషయానికొస్తే.. విజయశాంతి ఎంట్రీ అదిరిపోయింది. ఇందులో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తుంది. తన కొడుకు కూడా పోలీస్ అవ్వాలనుకుంటుంది. అనుకోకుండా కొన్ని గొడవల్లో హీరో దిగడంతో తల్లి, కొడుకుల పోరులా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాతో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి మళ్ళీ పదేళ్ల తర్వాత ఇలాంటి యాక్షన్లో కనిపిస్తానని అనుకోలేదు అంటూ మొదలైన టీజర్ లో పోలీసులను హైలెట్ చేశారు. కొడుకు కోసం ఆవేదన చెందుతున్న తల్లి కోరికను కొడుకు అర్జున్ తీరుస్తాడేమో చూడాలి.. కానీ చివరకు కళ్యాణ్ రామ్ గొడవలను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తాడు.. చివరకు పోలీసుల చేతిలోను రౌడీల చేతిలోనూ లేక రాజకీయ నాయకుల చేతిలోనూ కాదు ఈ అర్జెంట్ కనుసైగల్లో వైజాగ్ ఉంటుంది అని అదిరిపోయే డైలాగ్ తో వీడియో ఎండ్ అవుతుంది.. టీజర్ లో కనిపించే ఫ్రేమింగ్ సినిమా విజువల్ టోన్ ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని చెప్పకనే చెబుతోంది. టీజర్ పై మరింత ఆసక్తి పెరిగింది. ఒకవైపు కళ్యాణ్ రామ్ పాత్ర రణరంగంలోకి దిగింది అన్నది ఎంత నిజమో.. మరోవైపు వైజయంతి ఐపీఎస్ పాత్రలో ఏ విధంగా ఆకట్టుకోబోతోంది.. మొత్తానికైతే ఈ మూవీ భారీ యాక్షన్స్ సన్నివేశాలతో కూడిన స్టోరీ లాగా కనిపిస్తుంది. ఈ టీజర్ తో సినిమాపై అంచనాలు పెరిగాయి. మొత్తానికి సినిమా ఎలాంటి టాక్ ఇన్ అందుకుంటుందో చూడాలి.. ఇక ఈ మూవీ టీజర్ వీడియోను ఒకసారి చూసేయ్యండి..