Stray Dog Abuse Bengaluru| మంచి చెడు విచక్షణ కోల్పోయి ప్రవర్తించే వారు.. ఈ కాలంలో మరీ ఎక్కువగా కనిపిస్తున్నారు. కలియుగం అంటే ఇదేనేమో. తాజాగా ఒక యువకుడు ఒక వీధి కుక్కతో బలవంతంగా తన కామవాంఛను తీర్చుకున్నాడు. ఆ కుక్కను హింసించి దాని శరీర భాగాలను రక్తసిక్తం చేశాడు. అయితే ఇదంతా ఒక జంతు ప్రేమికురాలు చూసి పోలీసులకు చెప్పడంతో అతడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన బెంగళూరు నగరంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. బెంగళూరు నగరంలోని జయానగర్ ప్రాంతం షాలిని గ్రౌండ్ పరిసరాల్లో శుక్రవారం ఉదయం ఒక యువకుడు ఒక వీధి కుక్కను బలాత్కరిస్తూ ఉండగా.. ఆ ప్రాంతంలో అనాథ జంతువులకు ఆహారం అందించే ఒక మహిళ చూసింది. అయితే అతడిని పోలీసులకు పట్టించడానికి ఆమె వెంటనే తన ఫోన్ తీసి వీడియో రికార్డ్ చేసింది. ఆ వీడియో రికార్డ్ ఆధారంగా పోలీసులకు సమాచారం అందించింది.
Also Read: రూ.2 కోట్లు కంపెనీ నిధులు దోపిడీ.. చిన్న వాట్సాప్ మెసేజ్‌తో ఈజీగా దోచుకున్న ఫ్రాడ్!
జయనగర్ పోలీసులు వెంటనే.. ఆ ప్రాంతంలో ఆ యువకుడి కోసం గాలించి పట్టుకున్నారు. 23 ఏళ్ల ఆ యువకుడు బిహార్ రాష్ట్రానికి చెందినవాడని.. బెంగళూరులో కూలి పని చేసుకొని జీవనం సాగిస్తున్నాడని పోలీసుల విచారణలో తేలింది. మరోవైపు ఆ కుక్కను ఆ జంతు ప్రేమికురాలు జంతువుల వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా.. దాని ప్రైవేట్ భాగాల్లో తీవ్ర గాయాలున్నాయని.. ఇప్పటికే పలుమార్లు ఆ కుక్క లైంగిక వేధింపులు గురైందని వైద్యుడు తెలిపాడు.
నిందితుడిని పోలీసులకు పట్టించిన ఆ మహిళ చేసిన ఫిర్యాదు ప్రకారం.. ఇంతకుముందు కూడా అదే యువకుడు నెల రోజుల క్రితం ఒక రోజు తెల్లవారు జామున ఒక కుక్కతో ఇలాగే చేస్తుండగా.. తాను చూసి బెదిరించగా.. తనను తోసి పారిపోయాడని.. అతడిని వెంబడించగా.. ఒక ఆటో రిక్షాలో పారిపోయాడని తెలిపింది. ఆమె చేసిన ఫిర్యాదుపై పోలీసులు ఆ యువకుడిపై భారత న్యాయ సంహిత ప్రకారం.. కేసు నమోదు చేశారు.
ఇలాగే జనవరి 2025లో కూడా బెంగళూరు జేపి నగర్ లో ఒక యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ ఒక వీధి కుక్క పడుకొని ఉండగా.. దాని మీద నుంచి తన కారుని తీసుకెళ్లాడు. ఆ కుక్క చనిపోయిందని తెలిసి.. దాన్ని ఒక గోనె సంచిలో పెట్టి నగరానికి దూరంగా తీసుకెళ్లి పడేశాడు. అయితే ఈ దృశ్యాలన్నీ సమీపంలోని సిసిటీవి వీడియోలో రికార్డ్ అయ్యాయి.
గోనె సంచి ఒక చనిపోయిన కుక్క లభించడంతో ఆ పరిసరాల్లో నివసించే జంతు ప్రేమికురాలు.. పోలీసుల సాయంతో సమీపంలో సిసిటివి వీడియోలను పరిశీలించి.. నిందితుడిని గుర్తించింది. ఆ తరువాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిందితుడి అచూకీ తెలిసింది. జెపి నగర్ ఫేస్ 8 లోని శేఖర్ లేఅవుట్ లలో నివసించే మంజునాథ్ వెంకటేశ్ ని నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ఆ వెంటనే అరెస్ట్ చేశారు.