E-Paper
Advertisement

Karthi Khaidi movie : మోస్ట్ అవైటెడ్ కార్తీ ఖైదీ మూవీ గురించి లోకేష్ క్రేజీ అప్డేట్…

Karthi Khaidi movie : మోస్ట్ అవైటెడ్ కార్తీ ఖైదీ మూవీ గురించి లోకేష్ క్రేజీ అప్డేట్…
Advertisement
Karthi Khaidi

Karthi Khaidi movie : భాషతో సంబంధం లేకుండా కంటెంట్ కనెక్ట్ అయితే ప్రేక్షకులు చిత్రాలను విపరీతంగా ఆదరిస్తున్నారు. అలా మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఆడియన్స్ కి అందించే ఎన్నో చిత్రాలలో కోలీవుడ్ కి సంబంధించిన ఖైదీ చిత్రం ఒకటి. హీరో కార్తీ , డైరెక్టర్ లోకేష్ కనకరాజు కాంబినేషన్ లో విడుదలైన చిత్రం ఖైదీ. కేవలం తమిళ్లోనే కాకుండా ఈ చిత్రం తెలుగులో కూడా సూపర్ డూపర్ హిట్ గా మారడమే కాకుండా కార్తీ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

2019లో విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వైవిధ్యమైన కాన్సెప్ట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.నరేన్ , అర్జున్ దాస్ , హరీష్ ఉత్తమన్ , జార్జ్ మరియన్ ,ధీనా ఈ మూవీలో కీలక పాత్ర పోషించారు. బిడ్డ పుట్టక ముందు జైలు పాలై విడుదల తర్వాత కూతుర్ని కలవాలి అని బయలుదేరిన ఖైదీ …విషయం తిన్న పోలీసులను ఆస్పత్రికి తరలించడంలో సహాయపడతాడు. అయితే ఆ తర్వాత అసలు విషయం తెలియకుండానే డ్రగ్స్ కి సంబంధించిన పెద్ద మాఫియా తో పోలీసులు జరిపే పోరాటంలో పావుగా మారుతాడు.

Advertisement

ఇక ఆ తర్వాత లారీ వెనక విలన్స్ చేజింగ్ దగ్గర నుంచి..కార్తీ వాళ్ళని ఎదుర్కొని పోలీసులను తప్పించడం వరకు ఎక్స్ట్రాడినరీ సన్నివేశాలతో సాగుతుంది. మరి ముఖ్యంగా లాస్ట్ జైల్లో జరిగే ఫైటింగ్ సన్నివేశం అయితే గూస్ బంప్స్ క్రియేట్ చేస్తుంది. ఈ మూవీతో కార్తీకి యాక్టర్ గా మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఈ చిత్రం తర్వాత లోకేష్ కనకరాజు తనకంటూ ప్రత్యేకమైన ఒక మల్టీ వర్స్ సృష్టించాడు. అందులో భాగంగా వచ్చిన కనెక్టింగ్ మూవీ విక్రమ్ అయితే రాబోయే కనెక్టింగ్ మూవీ లియో అని టాక్ నడుస్తోంది.

ఎంతో న్యాచురల్ గా సాగే ఈ చిత్రం మంచి సక్సెస్ సాధించింది. పద్యంలో ఈ చిత్రం నుంచి సీక్వెల్ కోసం ఆడియన్స్, మూవీ లవర్స్ ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తర్వాత 2022లో విడుదలైన కమల్ హాసన్ విక్రమ్ చిత్రంలో ఖైదీ సినిమా చూపించకుండానే ఆ చిత్రం గురించి మెన్షన్ చేస్తూ దానికి ఈ మూవీకి మంచి లింక్ క్రియేట్ చేశారు. దాంతో ఈ మూవీ తర్వాత వెంటనే ఖైదీ సీక్వెల్ వస్తుంది అని అప్పట్లో అందరూ అనుకున్నారు. కానీ సీక్వెల్ రావడానికి సమయం ఎక్కువే పడుతుంది.

Advertisement

ఈ నేపథ్యంలో లేటెస్ట్ గా లోకేష్ ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్ ను అందించారు. తాను కూడా ఈ మూవీ కోసం ఎప్పటినుంచో ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నాను అని.. ప్రస్తుతం రజనీకాంత్ చేస్తున్న మూవీ ఫినిష్ అయిన వెంటనే ఈ చిత్రాన్ని స్టార్ట్ చేస్తానని పేర్కొన్నారు. ప్రస్తుతం తనకున్న కమిట్మెంట్స్ కారణంగా సీక్వెల్ లేట్ అవుతూ వచ్చిందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. పైగా ఈ ఖైదీ మూవీ సిరీస్ తనకు ఎంతో ప్రత్యేకమని.. తన సినిమాకి యూనివర్స్ మొదలైంది అని లోకేష్ అన్నాడు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×