England vs Bangladesh: హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం నందు తలపడిన ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ ఆరంభం మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన ఇంగ్లాండ్ ఈసారి మ్యాచ్ లో విజయ ఢంకా మోగించింది. ప్రత్యర్థి బంగ్లాదేశ్ జట్టుకు తేరుకునే అవకాశం ఇవ్వకుండా ప్రతి దాడి చేసింది. ఈ మ్యాచ్ లో విచిత్రం ఏమిటంటే మొదటి మ్యాచ్ లో ఓడిపోయిన ఇంగ్లాండ్ తన రెండవ మ్యాచ్ లో గెలవగా.. మొదటి మ్యాచ్ లో గెలిచిన బంగ్లాదేశ్ తన రెండవ మ్యాచ్ లో ఓడిపోయింది.
డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ ఈరోజు ప్రత్యర్థి బంగ్లాదేశ్ టీం పై 137 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. మొదట టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు,. మొన్న ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో కూడా టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలిత బౌలింగ్ ఎంచుకుంది. ఆ సెంటిమెంట్ కలిసి వస్తుంది అనుకున్న బంగ్లాదేశ్ కి ఈ మ్యాచ్ లో చుకేదురైంది. మ్యాచ్ ఆరంభం నుంచి మెల్లిగా ఇంగ్లాండ్ ఆటను పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకుంది. బెయిర్‌స్టో ఓపెనింగ్ వికెట్ కు 115 పరుగుల భాగస్వామ్యం అందించడంతో ఆ తరువాత రెండవ వికెట్ సమయానికి మలాన్, రూట్ కలిసి 151 పరుగులు జోడించగలిగారు.
బ్యాటింగ్‌కు దిగిన డేవిడ్ మలన్ విధ్వంసకరమైన పర్ఫామెన్స్ తో 140 పరుగులు చేసి స్కోర్ బోర్డును పరిగెత్తించాడు.జో రూట్ (82),జానీ బెయిర్‌స్టో (52) పరుగులు చేసి నెలకొల్పిన హాఫ్ సెంచరీలతో ఇంగ్లాండ్ 9 వికెట్ల నష్టానికి సునాయాసంగా 364 పరుగుల భారీ స్కోరు సాధించగలిగింది. మరోపక్క బంగ్లాదేశ్ టీం లో లిట్టన్ దాస్ 76 పరుగులు చేయగా..ముష్ఫికర్ రహీమ్ 51 పరుగులు,తౌహిద్ హృదయ్ 39 పరుగులు సాధించారు. ఇంగ్లాండ్ తరఫున రీస్ టాప్లీ (4/43) నాలుగు వికెట్లు తీయగా, క్రిస్ వోక్స్ (2/49) రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మరోపక్క బంగ్లాదేశ్ టీం కెప్టెన్ ఒకే ఒక పరుగుతో వెనుతిరిగాడు. ఇక బంగ్లాదేశ్ బౌలింగ్ విషయానికి వస్తే…మహేదీ హసన్ నాలుగు వికెట్లు తీయగా..షోరిఫుల్ ఇస్లాం మూడు వికెట్లు పడగొట్టాడు.
రెండవ మ్యాచ్ లో తన సత్తా చాటిన ఇంగ్లాండ్ ఇదే జోరు మిగిలిన మ్యాచుల్లో కూడా కొనసాగిస్తుందో లేదో చూడాలి. అక్టోబర్ 15న ఇంగ్లాండ్ ..ఆఫ్గనిస్తాన్ తో తలపడుతుంటే, బంగ్లాదేశ్ అక్టోబర్ 13 న న్యూజిలాండ్ తో తలపడనుంది. ఇక ఈ మ్యాచ్ లో రెండు జట్ల నుంచి పాల్గొన్న ప్లేయర్స్ లిస్ట్…
ఇంగ్లండ్: జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్/వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, రీస్ టాప్లీ
బంగ్లాదేశ్: తాంజిద్ హసన్, లిట్టన్ దాస్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), మెహిదీ హసన్ మిరాజ్, ముష్ఫికర్ రహీమ్ (వికెట్ కీపర్), తౌహిద్ హృదయ్, మహేదీ హసన్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్