BigTV English

Bhagavanth Kesari: బ్రో…ఐ డోంట్ కేర్… ఒక ట్రైలర్ తో చుక్కలు చూపించిన `భ‌గ‌వంత్ కేస‌రి

Bhagavanth Kesari: బ్రో…ఐ డోంట్ కేర్… ఒక ట్రైలర్ తో చుక్కలు చూపించిన `భ‌గ‌వంత్ కేస‌రి

Bhagavanth Kesari: బాలకృష్ణ (Nandamuri Balakrishna) మోస్ట్ అవైటెడ్ భ‌గ‌వంత్ కేసరి చిత్రం నుంచి మొదటి ట్రైలర్ అయితే విడుదల అయింది… అనుకున్నట్టే అంచనాలకు మించి ఈ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠతతో సాగింది. ఈ ట్రైలర్లో పూర్తిగా నటసింహం తన ఇంటెన్స్ యాక్షన్ తో పాటు హై వోల్టేజ్ పంచ్ డైలాగ్స్ తో అదరగొట్టింది. అనిల్ రావిపూడి మార్క్ …కన్నా ఈ చిత్రంలో బాలకృష్ణ మార్క్ ఎక్కువగా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా కూతురితో ఒకపక్క ఫ్రెండ్లీగా మరొకపక్క ఆమెను ఆర్మీ ఆఫీసర్ ను చేయాలి అనే తపన కలిగిన స్ట్రిక్ట్ ఫాదర్ గా బాలయ్య నటన పీక్స్ అని చెప్పొచ్చు. అతనే కోచ్ గా మారి తన కూతుర్ని తీర్చిదిద్దే విధానం అద్భుతంగా ఉంది.


ట్రైలర్ లో తండ్రి కూతుర్ల మధ్య ఉన్న సన్నివేశాలు ఒక లెవెల్ ఎమోషనల్ లో ఉన్నాయి.”నువ్వు ఏడున్నా గిట్ల ద‌మ్ముతో నిల‌బ‌డాలి. అప్పుడే దునియా నీ బాంచ‌న్ అంట‌ది..! అన్న ట్రైలర్ స్టార్టింగ్ లో బాల‌య్య డైలాగ్ అతని కూతుర్ని ఎంత స్ట్రాంగ్ గా చేయాలి అనుకుంటున్నాడు చెప్పకనే చెబుతుంది. ఇప్పటివరకు బాలకృష్ణలో ఇంత వైలెంట్ యాంగిల్ ని సైలెంట్ గా చూపించగలిగేది ఒక్క బోయపాటి అని అందరూ అనుకున్నారు…కానీ ఈసారి అనిల్ రావిపూడి కూడా ఈ యాంగిల్ లో బాలయ్యను బ్రహ్మాండంగా చూపించగలడు అని నిరూపించుకున్నాడు.

ట్రైలర్లో సినిమా గురించి చాలావరకు హింట్ ఇచ్చారు. ఒక మామూలు మధ్యతరగతి తండ్రి ఒక భయంకరమైన విలన్ ని కూతురు కోసం ఢీకొట్టే విధానం అద్భుతంగా చిత్రీకరించడం జరిగింది. బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ ఇందులో విలన్ గా బాగా ఎలివేట్ అయ్యాడు. అనుకోకుండా కూతురికి ఆపద ఎదురైనప్పుడు యమకింకరుడులా తండ్రి అడ్డు నిలబడితే సిచువేషన్ ఎలా ఉంటుంది అనేదాన్ని మంచి మాస్ మసాలా యాడ్ చేసి రావిపూడి ఈ చిత్రంలో తెరకెక్కించారు.”దేవుడు ఎవరు రా…ఎవరూ…బిడ్డ ముందు తండ్రి నిల‌బ‌డితే ఆడే 100 మంది దేవుళ్లు లెక్క‌!”అంటూ తన కూతురు మీద అటాక్ చేస్తున్న విలన్స్ పై బాలయ్య దూసుకు వెళ్లే విధానం ట్రైలర్ కి స్పెషల్ అట్రాక్షన్.


ఒక మంచి హైయాక్షన్ ప్యాకెట్ ట్రైలర్ అయినప్పటికీ అక్కడ కూడా ఇందులో కాస్త కూడా ఓవర్ అనిపించలేదు. ట్రైలర్ మొత్తం బాలకృష్ణ ఒక్కడే ఉన్నాడా అన్న భావన చూసినవారికి కలుగక మానదు…మరి బాలయ్య పర్ఫామెన్స్ అంత హై ఎనర్జీ లెవెల్ లో ఉంది మరి. తన కన్న కూతుర్ని రియల్ లైఫ్ లో ఒక మంచి వారియర్ ను చేయాలి అని తండ్రి తపన ఈ మూవీలో బాగా కనిపిస్తుంది. బాలకృష్ణ వన్ మ్యాన్ షో చేసిన ఈ భ‌గ‌వంత్ కేస‌రి మూవీ రేపు దసరాకు బరిలోకి దిగనుంది. మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే మూవీ బాలయ్య ఫ్యాన్స్ కి మంచి దసరా ట్రీట్ అనిపిస్తుంది. 

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×