E-Paper
Advertisement

Eagle Movie : మాస్ మహారాజ్ ఈగల్ నుంచి క్రేజీ అప్డేట్.. ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్..

Eagle Movie : మాస్ మహారాజ్ ఈగల్ నుంచి క్రేజీ అప్డేట్.. ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్..
Advertisement
Eagle Movie

Eagle Movie : హిట్.. ఫ్లాప్ సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోయే నటుడు రవితేజ. ధమాకా ,వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలు బాగా అచ్చి వచ్చినా.. ఆ తర్వాత రావణాసుర.. టైగర్ నాగేశ్వరరావు బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్న రేంజ్ లో పర్ఫార్మ్ చేయలేకపోయాయి. అందుకే రాబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఈగల్ పై రవితేజ హోప్స్ అన్నీ ఉన్నాయి. ఈ మూవీ సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదల కాబోతోంది.

అయితే ఇప్పటికే సంక్రాంతి బరిలో భారీ చిత్రాలు బారులు తీరి ఉన్నాయి. మెయిన్ గా గుంటూరు కారం తో ఈగల్ పోటీ పడాల్సి ఉంటుంది. మహేష్ బాబు మోస్ట్ అవైటెడ్ గుంటూరు కారం జనవరి 12న థియేటర్లలో విడుదలవుతుంది. పోటీ గట్టిగా ఉన్న కంటెంట్ సాలిడ్ గా ఉంది అంటూ.. ఈగల్ చిత్ర బృందం ఈ మూవీపై కాన్ఫిడెంట్ గానే ఉన్నారు. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ కూడా జోరు మీద సాగుతున్నాయి.

Advertisement

ఈ నేపథ్యంలో మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ రిలీజ్ పై మేకర్స్ కొత్త అప్డేట్లు విడుదల చేశారు. ఆడు మచ్చా అనే క్యాచీ టైటిల్ తో ఓ పోస్టర్ని విడుదల చేశారు. ఇక ఆ పోస్టర్లో సాంగ్ విడుదల డిసెంబర్ 5వ తారీఖు అని మెన్షన్ చేశారు. పోస్టర్ విషయానికి వస్తే ఒకపక్క భద్రకాళి దేవి ..చుట్టూ అఘోరాలు లాగా ఉన్న మనుషులు.. జే గంటలు.. దీపాలు.. డివోషనల్ వైఫ్ తో పాటు మాస్ ఎలివేషన్ కూడా ఈ పోస్టర్లో బాగా కనిపిస్తోంది. రాబోయే సాంగ్ మంచి మాస్ బీట్ సాంగ్ అన్న విషయం ఆడు మచ్చా అనే క్యాచీ లైన్ ను బట్టి అర్థమవుతుంది.

ప్రస్తుతానికి ఈ పాట విడుదల విషయం పోస్టర్ ద్వారా తెలియచేసిన చిత్ర బృందం ఈరోజు సాయంత్రం లోగా దీనికి సంబంధించిన ప్రోమోని కూడా విడుదల చేస్తారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబోట్ల నిర్మాణ బాధ్యతలు వహిస్తున్నారు. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్,కావ్య థాపర్ మెయిన్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. రేపు విడుదల ఈ పాట చిత్రంపై అంచనాలను ఏ మాత్రం పెంచుతుందో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×